రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మంగా పావులు కదుపుతోంది. ఇటీవల మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ ఆ విజయం ఇచ్చిన ఊపులో కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్రాల పీసీసీల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. ఆమెను ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌పై గురిపెట్టిన హస్తం..
ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ను నడిపించే అధికారాలను ప్రియాంకకు కట్టబెట్టింది. అలాగే మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన యువనేత జ్యోతిరాథిత్య సింధియాను పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.