బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ సోమవారం మంగళూరులోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇటీవల తలకు గాయం తలగడం తో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది. వైద్యులు శస్త్రచికిత్స జరిపినప్పటికీ, ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదు. చికిత్స పొం దుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు మంగుళూరు పోలీసులు ధ్రువీకరించారు. ఆస్కార్ తండ్రి రోక్ ఫెర్నాండెజ్ గొప్ప విద్యావేత్త, ఆయన మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి తొలి అధ్యక్షుడు. తల్లి లియోనిసా ఫెర్నాండెజ్ భారత తొలి మహిళా మెజిస్ట్రేట్. తల్లిదండ్రులు ఇద్దరూ పేరుప్రఖ్యాతులు ఆర్జించినవారే కావడంతో ఆస్కార్ కూడా చిన్నతనం నుంచి వారి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేశారు. రాజకీయాల ద్వారా ప్రజా సేవలో గడపాలని నిరయించుకొని, 1975- ఉడిపి మున్సిపల్ కౌన్సిలర్‌గా తన ప్రస్తానాన్ని ప్రారంభించారు. 1980 నుంచి 1996 మధ్యకాలంలో ఐద పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి అత్యంత ఆప్తుడిగా, నమ్మకస్తుడిగా వ్యవహరించిన ఆయన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఏర్పడిన యుపిఎ వన్ హయాంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా సేవలు అందించారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఆయనను లోక్‌సభకు నామినేట్ సింది. 2004లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆస్కార్ మృతికి కాంగ్రెస్‌సహా పలు పార్టీలకు చెందిన నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
సిఎం కెసిఆర్ సంతాపం : రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. యుపిఎ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆస్కార్ ఫెర్నాండెజ్ రోడ్డు రవాణ, హైవే,కార్మిక, ఉపాధికల్పన శాఖలకు మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. తొలి యుపిఎ ప్రభుత్వంలోని క్యాబినెట్‌లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించిందన్నారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటని, ఆయన చేసిన సేవలు గొప్పవని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఫెర్నాండేజ్ సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్ కన్నుమూత
RELATED ARTICLES