వాయనాడ్ నుంచి రాహుల్‌గాంధీ పోటీ నిర్ణయంపై డి.రాజా సూటిప్రశ్న
న్యూఢిల్లీ: రాహుల్‌జీ కాంగ్రెస్‌కు ప్రధాన శత్రు వు ఎవరు? బిజెపినా, వామపక్షాలా? ఈ విషయం స్పష్టం చేయండి. కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయ నిర్ణయించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సూటిగా ప్రశ్నించా రు. ఉత్తర ప్రదేశ్‌లో నెహ్రూ గాంధీ కుటుంబానికి సాంప్రదాయకంగా బలమైన అమేథీతోపాటు రెండవ నియోజకవర్గంగా వామపక్షాలకు బలమైన వాయనాడ్ నుంచి పోటీ చేయాలని రాహుల్‌గాంధీ నిర్ణయించుకోవడం తెలిసిందే. రెండో నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయటం ఇదే ప్రథమం. సిపిఐ అభ్యర్థి పిపి సునీర్ ఆయన ప్రధాన ప్రత్యర్థి. బిజెపి కూడా ఒక జాతీయ నాయకుణ్ణి వాయనాడ్‌లో రాహుల్‌పై పోటీకి దించుతుందన్న ఊహాగానాలను తోసిపుచ్చుతూ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, తమ మిత్రపక్షమైన భారత్ ధర్మ జనసేన నాయకుడు తుషార్ వేలంప్పళ్లి ఎన్‌డిఎ అభ్యర్థిగా పోటీచేస్తారని సోమవారం ప్రకటించారు. అతడు వాస్తవానికి త్రిస్సూర్ అభ్యర్థి. అతను ఎజవా సామాజిక సముదాయం సంక్షేమానికి పనిచేస్తున్న శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం ప్రధాన కార్యదర్శి వి.నటేశన్ కుమారు డు. అయితే వాయనాడ్ నియోజకవర్గంలో బిజెపి ఉనికి నామమాత్రం. ఇది ముస్లింలు, క్రైస్తవుల మెజారిటీ నియోజకవర్గం. కేరళలో ఎల్‌డిఎఫ్ యుడిఎఫ్ సాంప్రదాయకంగా ప్రత్యర్థి కూటము లు. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో వాయనాడ్‌లో సిపిఐపై కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. 2014 ఎన్నికల్లో విజేత మెజారిటీ 20వేల చిల్లర మాత్రమే. డక్కన్ హెరాల్డ్ విలేకరి ఇంటర్వ్యూలో డి.రాజా ఇలా చెప్పారు : కాంగ్రెస్ వారు ఏ రాజకీయాలు ఆచరిస్తున్నారో అర్థం కావడంలేదు. కేరళలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వంలో యుడిఎఫ్ పనిచేస్తున్నాయి. రాహుల్‌గాంధీకి కేరళలో నియోజకవర్గం ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ దేశానికి ఏమి సందేశం పంపుతున్నది? ఈ ఎన్నికల్లో వారి శత్రువు ఎవరు? లోక్‌సభ ఎన్నికల్లో మతోన్మాద, ఫాసిస్టు బిజెపిని ఓడించటం, దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే నిమిత్తం నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని తొలగించటం ప్రధాన లక్ష్యంగా మేమంతా చెబుతున్నాం. వామపక్షానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కేరళ నాయకుడెవరైనా పోటీ చేయవచ్చు. అయితే వాయనాడ్ నుంచి రాహుల్‌గాంధీని పోటీకి దించటం దేశంలోకి సరైన సందేశం పంపదు. వారు బిజెపికి వ్యతిరేకంగా కాకుండా లెఫ్ట్‌పై పోటీ చేస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో ప్రతిపక్ష ఐక్యతపై కచ్చితంగా ప్రతికూల ప్రభావంచూపుతుంది.