ప్రజాపక్షం/హైదరాబాద్: కృష్ణా జలాల పెండింగ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో నిర్లక్ష్యం, దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్‌లపై వివక్షత కు వ్యతిరేకంగా ప్రాజెక్ట్‌ల వద్ద నిరసన దీక్షకు బయలుదేరిన కాంగ్రెస్ ముఖ్య నేతలను మంగళ వారం ఉదయమే పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. వారిని గృహనిర్బంధంలో ఉంచారు. ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్ట్ వద్దకు బయలు దేరిన పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సిఎల్‌పి మాజీ నేత జనారెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పోలీసు లు అరెస్ట్ చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలి ంచారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో జలదీక్షకు బయలు దేరిన టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్, ఎంపి ఎ.రేవంత్‌రెడ్డిని కొడంగల్‌లో ఆ యన నివాసం వద్ద అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద దీక్షకు సన్నద్ధమవుతున్న ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంఎల్‌ఎ చల్లా వంశీ చంద్‌రెడ్డిని తెల్లవారు జామునే పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. వికారా బాద్ డిసిసి అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఎ పి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎం.పి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను పోలీసులు వారి నివాసాల్లో అరెస్ట్ చేశారు. పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు, మాజీ ఎంపి మల్లు రవి, ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ జిల్లాల్లో పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. నాయకులందరినీ సాయంత్రం విడిచి పెట్టా రు. ఇదిలా ఉండగా సిఎల్‌పి నేత మల్లు బట్టి విక్రమార్క ఇతర నేతలతో కలిసి ఖమ్మం నగరంలోని డిసిసి కార్యాలయంలో జల దీక్ష చేశారు.
కాంగ్రెస్ నేతల అరెస్ట్
RELATED ARTICLES