ప్రజాపక్షం / హైదరాబాద్ : టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఇందుకు చాలా ఉదంతాలు ఉన్నాయని, రాష్ట్ర మంత్రి కెటిఆర్, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు పొద్దున దూషించుకుంటారని, రాత్రి సమాలోచనలు జరుపుతారని ఆయన ఆరోపించారు. హుజూర్ నగర్‌లో త్వరలో జరిగే ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టిఆర్‌ఎస్‌కు వేసినట్టేనని ఆయన అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఆదివారం ఆయన మీడియాతో మా ట్లాడారు. తెలంగాణలో కుటుంబ పాలనపై బిజెపి పోరాడుతోందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమైందని, చివరకు ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన మందుల కొనుగోలులో కూడా అవినీతి రాజ్యమేలుతుందని డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్, టిఆర్‌ఎస్ ఒకటే : లక్ష్మణ్
RELATED ARTICLES