ప్రజాపక్షం / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికా రంలోకి రావడం ఖాయమని టిపిసిసి అధ్య క్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉచితంగా ఇళ్ల నిర్మాణం చేపడు తామని తెలిపారు. ఈ విషయమై ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అధికారంలోకి రాగానే ఇంది రమ్మ లబ్దిదారులకు రెండు లక్షలు, కొత్తగా ఇళ్ళ నిర్మాణ లబ్దిదారులకు రూ.5 లక్షలు, దళిత, గిరిజన లబ్దిదారులకు రూ.6 లక్షలతో ఉచితంగా ఇళ్ల నిర్మాణం చేపడుతామని ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా ఇళ్ళు : ఉత్తమ్
RELATED ARTICLES