హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపి రాపోలు ఆనంద్ భాస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పటిష్టత కోసం తాను అంకితభావంతో పని చేశానని, కానీ పార్టీ అధిష్ఠానం తనను అవమానించిందని రాపోలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ విధేయులను విస్మరించి ఏకపక్షంగా వ్యవహిరిస్తోందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో పార్టీ ఎదిగే సూచనలు కనిపించడం లేదని ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి పంపించినట్టు ఆయన వెల్లడించారు. అయితే ఏ పార్టీలో చేరతాననే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్న తనను కావాలనే పక్కన పెట్టారని, అయినప్పటికీ తాను పార్టీ పటిష్టత కోసం కృషి చేశానని ఆయన తెలిపారు.
కాంగ్రెస్‌కు మరో షాక్
RELATED ARTICLES