గాందర్బల్ అడవుల్లో హెలికాప్టర్ల ద్వారా ఎలైట్ కమాండోల జారవేత
శ్రీనగర్ దుర్భర మార్గంలో ఉగ్రవాదులు కనిపించడంతో ఆపరేషన్
శ్రీనగర్: కశ్మీర్‌లో ‘దాక్కుని ఉన్న ఉగ్రవాదుల ను’ కనిపెట్టేందుకు భద్రతా దళాలు పెద్ద ఆపరేషన్‌ను మొదలెట్టాయి. కశీర్‌లోని చిట్టడవి గాందర్బల్ అడవుల్లోకి అత్యున్నత పారా టాపర్లను హెలికాప్టర్ల ద్వారా దించుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ వివరాలపై సైన్యం నోరు మెదపడంలేదు. సెప్టెంబర్ 27న రాత్రి 9 గం టలకు ఈ అడవుల్లో నియంత్రణ రేఖ దాటి వచ్చిన ఇద్దరు చొరబాటుదారులను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేయడంతో సైన్యం అప్రమత్తం అయింది. పెద్ద ఎత్తున తీవ్రవాదు లు దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్ పట్టణానికి కదలొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి. దాంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రణాళికలు రచించాయి. దీంతో దళాలను అక్కడికి వేగంగా చేర్చేందుకు హెలికాప్టర్ల ద్వారా అత్యున్నత పారా టాపర్ బలగాలను అడవిలో జారవిడుస్తున్నాయి. బండిపోర జిల్లాలోని మా రుమూల గురేజ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖను ఉగవాదులు దాటి ఉంటారని అనుమానిస్తున్నారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దుచేసి, దానిని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక సైన్యం ఇలా పెద్ద ఆపరేషన్‌ను మొదలెట్టడం ఇదే మొదటిసారి. గంగ్‌బల్ అనేది కొండ ప్రాంతం. ఇక్కడ మంచినీరున్న పెద్ద సరస్సు ఉంది. ఇది గురేజ్, గాందర్‌బల్ జిల్లాల మధ్య ఉంది. శ్రీనగర్, దక్షిణ కశ్మీర్ పరిసర కొండలను కూడా ఈ ప్రాంతం కలుపుకుని ఉంటుంది. విదేశీ పర్యాటకులు ట్రెక్కింగ్ చేయడానికి, బస చేయడానికి ఈ పెద్ద సరస్సు ఉన్న ప్రాంతం ఇష్టమైన ప్రదేశం. ప్రస్తుతం ఇక్కడికి వస్తున్న వారి వివరాలను పోలీసులు రికార్డు చేస్తున్నారు. ఓ వైపుసైనిక ఆపరేషన్ జరుగుతున్నా.. మరోపక్క విదేశీ పర్యాటకులు వస్తూనే ఉన్నారు. దీంతో అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించే వారి వివరాలను నమోదు చేసుకొంటున్నారు.తీవ్రవాదులు ఇక్కడి సాంప్రదాయిక మార్గాన్నే ఎంచుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. ్ర