కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ/వాయ్‌నాడ్: కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత విషయమని, ఇందులో పాకిస్థాన్ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై గతకొంతకాలంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న రాహుల్, తాజాగా ఇదే కశ్మీర్ అంశంపై ప్రభుత్వానికి మద్దతిస్తూ మాట్లాడటం విశేషం. ‘చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యలను నేను వ్యతిరేకించాను. కానీ ఈ విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. కశ్మీర్ భారత అంతర్గత విషయం. ఇందులో పాకిస్థాన్ లేదా ఇతర ఏ దేశమైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. జమ్మూకశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్ మద్దతు, ప్రేరణ వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతిచ్చే ప్రధాన దేశం పాకిస్థాన్ అని తెలిసిందే కదా’ అని రాహుల్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
కశ్మీర్‌లో బాహ్య జోక్యానికి తావులేదు
RELATED ARTICLES