HomeNewsNationalకవితను ప్రశ్నించాం

కవితను ప్రశ్నించాం

కవితను ప్రశ్నించాం
ఢిలీ కోర్టుకు చెప్పిన సిబిఐ

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై అరెస్టయిన కవితను తాము తీహార్‌ జైలులో ప్రశ్నించామని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ బుధవారంనాడు ఢిల్లీ కోర్టుకు తెలియజేసింది. సౌత్‌ గ్రూప్‌లో కీలక సభ్యురాలుగా ఉన్న కవిత ఆమ్‌ ఆద్మీ పార్టీకి ముడుపులు సమర్పించిన కేసులో ఆరోపణలపై మార్చి 15వ దీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుండి అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆమె తీహార్‌ జైలులో ఉన్నారు. ఆమెను ప్రశ్నించేందుకు అనుమతి ఇవాలని కోరిన ఇడి అధికారులు అనుమతి పొందాక తీహార్‌ జైలుకు వెళ్ళి ఆమెను ప్రశ్నించారు. బాహ్య ప్రపంచంలో ఉంటే ఆమె సాక్ష్యులను బెదిరించి కేసు విచారణా ప్రక్రియను తపుదోవ పట్టిస్తారన్న కారణంగా ఆమెను ప్రస్తుతం తీహార్‌ జైలులో బంధించారు. ఆమెను జైలులో ఉండగానే ప్రశ్నించేందుకు అనుతించాలని సిబిఐ అధికారులు కోర్టును కోరారు. ఈనెల ఐదో తేదీన కోర్టు అనుమతి ఇచ్చింది. తాము కవితను ఈనెల ఆరో తేదీన జైలులో విచారణ చేశామని సిబిఐ అధికారులు బుధవారంనాడు కోర్టుకు తెలియజేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, తెలంగాణ శాసనమండలి సభ్యురాలు కె.కవిత ఢిల్లీ ఎక్సైజు విధానాన్ని రూపొందించాక దానిని సౌత్‌ గ్రూపునకు లీక్‌ చేశారని, ఈ గ్రూప్‌ తరపున క్రియాశీల సభ్యురాలైన కవిత ఆప్‌ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు చెల్లించడంలో ముఖ్యపాత్ర మధ్యవర్తులద్వారా నిర్వహించారనీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments