ప్రజాపక్షం / హైదరాబాద్ కలెక్టర్లతో సిఎం కెసిఆర్ సమావేశం తేదీని ముందుకు జరిపారు. మార్చిన దానిప్రకారం ఈ నెల 26న ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి వారితో సమావేశం కానున్నారు. జిల్లా పాలనాధికారులు, స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, డిపిఒలు, డిఆర్‌డిఒలు ఇందులో పాల్గొననున్నారు. తొలుత ఈ నెల 28న ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దానిని 26వ తేదీకి మార్చారు. కలెక్టర్ల సమావేశానికి హాజరుకావాలని మంత్రులకు సమాచారం అందించారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారంపై ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఈ అంశాలపై జిల్లాల అదనపు కలెక్టర్‌లతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు.
కలెక్టర్ల సమావేశం 28న కాదు, 26న…
RELATED ARTICLES