త్వరలోనే పరిషత్ పోరు
వరుస నోటిఫికేషన్లు జారీ చేయనున్న ఇసి
ఎన్నికల విధుల్లో అధికార యంత్రాంగం బిజీ బిజీ
సిఎం డెడ్‌లైన్‌ను ఖాతరు చేయని వైనం!
ప్రజాపక్షం/హైదరాబాద్ : సమీకృత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు వివిధ కారణాలతో నిదానంగా సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలోనే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు రానుండడంతో అధికార యం త్రాంగం అంతా ఎన్నికల విధుల్లో తలమునకలు అవుతున్నారు. దీంతో కలెక్టరేట్ నిర్మాణ పనులపై ప్రభావం పడనుంది. కలెక్టరేట్లు, ఎంఎల్‌ఎల క్యాం పు కార్యాలయాలు మొదలుకొని లుంబికాంప్లెక్స్‌లో అమరవీరుల స్మారక స్థూపాన్ని జ్వలించే జ్యోతి రూపంలో నిర్మించాల్సి ఉంది. ఇంకా అలాగే హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని బోరబండ ప్రాంతంలో 60 వేల చదరపు అడగుల విస్తీర్ణంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని నిర్మించాల్సి ఉంది. సాంస్కృతిక ఉత్సవాలను తిలకించేందుకు కూడా తెలంగాణ కళాభారతిలాంటి వాటిని నిర్మించాలని భావించినప్పటికీ వివిధ కారణాలతో ప్రస్తుతం కలెక్టరేట్ల నిర్మాణాలకే ప్రాధాన్యతనివ్వాలని భావించింది.
ఎన్నికల మీద ఎన్నికలే ! నిర్మించాలని సంకల్పించిన భవనాలను సాకారం చేసుకునేందుకు నిధులను కూడా కేటాయించినప్పటికీ అధికార యంత్రాంగం అంతా ఇప్పుడు వరుస ఎన్నికల కార్యక్రమాల్లోనే నిమ గ్నం అయి ఉంటోంది. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘానిదే బాధ్యత అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేసేది వివిధ ప్ర భుత్వ శాఖల అధికారులే కావడం, వారందరూ కూడా ఎన్నికల విధులతో ముడి పడి ఉండడంతో కలెక్టరేట్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు మందగించాయి. నీపార్కు వద్ద పర్యాటకశాఖ