జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యానికి విఘాతం
సిపిఐరాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/నాగర్‌కర్నూల్‌ప్రతినిధి జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ సిద్ధాంతాలతో కలిసొచ్చే శక్తులతో ఎన్నికలకు సిద్ధమని స్పష్టం చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలో భారతకమ్యూనిస్టుపార్టీ మాజీ నాయకులు కామ్రేడ్ ఎం.లింగారెడ్డి ప్రథమవర్ధంతి సందర్భంగా స్థూపావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాడ్రన్ బిఇడి కళాశాల భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగమేఘాలమీద జమిలి ఎన్నికలతో విజయం సాధించవచ్చని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఉంటాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలనుమోసం చేస్తూ ఉచితాల పేరుత ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త కొత్త పథకాలతో సామాన్యప్రజలను మభ్యపెట్టి మూడోపర్యాయం కూడా అధికారం చేపట్టాలనే దురహంకారంతో పావులు కలుపుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో సిపిఐ, సిపిఐ(ఎం) కలిసివచ్చే డెమోక్రటిక్‌పార్టీలను కలుపుకొని అనేకచోట్ల పోటీకి దిగుతామని ఆయన స్పష్టంచేశారు. కమ్యూనిస్టుపార్టీలు పదవులను ఆశించవని, ప్రజాసమస్యలపై నిరంతరపోరాటం చేస్తూనే ఉంటాయన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించేలా కమ్యూనిస్టుపార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యులు ఎం.బాల్‌నర్సింహ్మ, రాష్ట్రసమితిసభ్యులు వార్లవెంకటయ్య, కేశవులుగౌడ్, కందాలరామకృష్ణ, అజయ్‌కుమార్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
లింగారెడ్డి ఆశయాలు కొనసాగిద్దాం
భారతకమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) రాష్ట్ర మాజీ నాయకులు కామ్రేడ్ మాడుగుల లింగారెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా లింగారెడ్డి ప్రతిబింబంతోకూడిన భారీ స్థూపాన్ని ఆవిష్కరించి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ భారతకమ్యూనిస్టుపార్టీకి ఉమ్మడి పాలమూరు జిల్లా గీటురాయిగా మాడుగుల లింగారెడ్డి 20 సంవత్సరాల వయసులోనే కందాల లక్ష్మణాచారితో పరిచయాలు పెంచుకుని ఈ ప్రాంతప్రజలకు ఎంతో ఆదర్శంగా నిలిచారన్నారు. భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా కొనసాగుతూ వారి అరాచకాలను ఆరికడుతూ ఇక్కడి ప్రజలను ఎంతగానో చైతన్య పరిచారన్నారు. ఆ తర్వాత సురవరం సుధాకర్‌రెడ్డితో పరిచయం ఏర్పడి రాష్ట్రకంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టి పేదప్రజలకు అండగా ఉంటూ కార్మికులకు, కర్షకులకు అనుక్షణం తమ సమస్యలపై పోరాటాలు నిర్వహించారని చెప్పారు. తన సతీమణి బాలీశ్వరీదేవి కుమార్తె రజితరెడ్డి, అల్లుడు సంజీవరెడ్డి, కుమారులు అజయ్‌కుమార్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డిలు తమ తండ్రి ఆశయాలను తరతరానికి ఈప్రాంత ప్రజలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో స్థూపాన్ని నిర్మించి ఆవిష్కరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. లింగారెడ్డి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లింగారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ్మ, రాష్ట్రసమితి సభ్యులు కేశవులుగౌడ్, వార్లవెంకటయ్య, కందాలరామకృష్ణ, ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలిసొచ్చేశక్తులతోఎన్నికలకు సిద్ధం
RELATED ARTICLES