ముంపు ప్రాంత ప్రజలు పరిస్థితి దయనీయం
న్యాయం కోసం 5న దీక్ష
భద్రాచలం మునిగితే సహించేది లేదు
విలేకరులతో ఉమ్మడి రాష్ట్ర అఖిలపక్షం
ప్రజాపక్షం/భద్రాచలం : కేంద్రంలోని బిజెపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసిపి పార్టీలు పోలవరం పేరుతో ఈ ప్రాంతాన్ని, సంస్కృతి సంప్రదాయాలను కలిసకట్టుగా గోదాట్లో ముంచబోతున్నాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అఖిలపక్ష నేతలు ఆరోపించారు. శనివారం భద్రాచలం పట్టణంలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాల యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మధు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ నిర్వాసితులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసితులకు సరైన పునరా వాస ప్యాకేజీ అందించకుండా టిడిపి అమలు చేసిన పరిహారాన్ని ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలోని చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక ముంపు మండలాల్లో అఖిలపక్షం పర్యటన సాగిందని, అక్కడి ప్రజల పరిస్థి తులు చాలా భయానకంగా ఉన్నాయని తెలిపారు. కాపర్ డ్యాం నిర్మాణం కారణంగా బ్యాక్ వాటర్ వస్తోం దని, ఆ నీళ్లు వస్తే ప్రస్తుతానికి మూడు మాసాలపాటు నిలుస్తాయని అధికారులు చెబుతున్నారని, దీంతో జనం ఉన్న ఊర్లను, ఇళ్లను వదిలి పిల్లా పాపలు, గొడ్డుగోదతో గుట్టలెక్కి పూరిపాకలు వేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణం కారణంగా సుమా రు 3 లక్షల మంది జనాభా ఇబ్బందులు పడతారని, సారవంతమైన వ్యవసాయ భూమి మాయమైపోతుం దని, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు నీళ్లలో కలిసిపో బోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థి తుల్లో కేంద్ర ప్రభుత్వం రెట్టింపు ప్యాకేజీ ఇవ్వాలని, రాష్ట్ర సర్కార్ పునరావాస ప్యాకేజీని సంతృప్తి కరంగా అందించాలన్నారు. అలా కాదని ప్రజలను భయభ్రాం తులకు గురిచేసి బలవంతంగా వైసిపి ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని, ఇది మంచిపద్దతి కాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రజలు నిర్వాసితులు అయ్యే పరిస్థితి ఏర్పడితే, ప్రజలకు సంతృప్తి కరమైన ప్యాకేజీ ఇవ్వాలని పార్లమెంట్‌లో చట్టం చేసినప్పటికీ దానిని తుంగలో తొక్కి అమాయక జనాన్ని మోసం చేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజలపై బల ప్రయోగం చేస్తే సహించేదే లేదని, ప్రజల పక్షాన అఖి లపక్షం నిలబడి పోరాటాలను చేస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలం పట్టణా నికి కూడా తీవ్ర నష్టం వాటిల్లనుందని, ఈ ప్రాంతం మునకకు గురైతే సహించేదే లేదని, ఎంతటి పోరాటాని కైనా సిద్ధపడతామని హెచ్చరించారు. ముంపు ముప్పు లేకుండా చర్యలుచేపట్టి, కాపర్‌డ్యాం, పోలవరం ప్రాజెక్టుకు నీటి నిల్వ అడ్డుకట్టులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత ప్రజల సమస్య పరిష్కారం కోసం, జగమొండి ప్రభుత్వాల మెడలు వంచేందుకు ఈ నెల 5వ తేదీన విజయవాడలో అఖిలపక్షం ఆధ్వర్యాన దీక్ష చేపడుతున్నామని, ఈ దీక్షకు బిజెపి, వైసిపి తప్ప అన్ని రాజకీయపక్షాలు, గిరిజన, దళిత, రైతు, కార్మిక, కర్షక సంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ దీక్ష అనంతరం 7వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని మండలాల తరపున రాజమండ్రిలో, పశ్చిమగోదావరి జిల్లా తరపున జంగారెడ్డి గూడెంలో ఆయా మండలాల అఖిలపక్ష నేతలు దీక్షలు చేపడతారని చెప్పారు. అనం తరం టిడిపి మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ మాట్లా డుతూ వైసిపి సర్కార్ దుర్మార్గమైన పాలన సాగిస్తోందని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రాణ భయాన్ని కల్పించి ఇళ్లు వదిలి వెళ్లిపోయేలా చేస్తోందని మండి పడ్డారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ప్రస్తుత నష్టం వైసిపి సర్కార్‌కు స్పష్టంగా తెలుసని, కానీ పునరావాస ప్యాకేజీ విషయంలో దోబూచులాట ఆడుతోందన్నారు. అనంతరం భద్రాచలం ఎంఎల్‌ఎ పొదెం వీరయ్య మా ట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరుదైన గిరిజన జాతిని, సంస్కృతి, సంప్రదాయాలను గోదావరి నదిలో ముంచబోతున్నాయని, ప్రజలను మోసం చేసి ఈ భూ భాగాన్ని లాక్కుని ఇక్కడి విలువైన సంపదను దోచుకునే కుట్ర చేస్తున్నారని అన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ కూడా భద్రాచలం విషయంలో దొంగాట ఆడుతూ పిట్ట కథలు చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రంపచోడవరం మాజీ ఎంఎల్‌ఎ వంతల రాజేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకోవడం ఇకనైనా మానుకోవాలని, సరైన పరిహారం ఇవ్వకుంటే సహించేది లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎపి రాష్ట్ర విభజన హామీల సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్ యాదవ్, ఎపి కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ నాయకులు గురునాధ రావు, టిడిపి రైతు నాయకులు శ్రీనివాసరెడ్డి, జనసేన మాజీ ఎంఎల్‌సి కందుల దుర్గేశ్, జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ వంపురి గంగులయ్య, మాజీ ఎంఎల్‌ఎ గుమ్మడి నర్సయ్య, మాజీ ఎంఎల్‌ఎ, జాతీయఆదివాసీ అఖిలసభ సంఘాల జెఎసి జాతీయ కన్వీనర్ చందా లింగయ్య దొర, న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చల రంగారెడ్డి, టిజెఎస్ నాయకులు గోపగాని శంకర్ రావు, టి సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌తో పాటు అఖిలపక్ష నాయకులు, గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు.