కలప దొంగతనం చేసే వారిపై పిడి యాక్టు
ఏ పార్టీ అయినా, ఎంత పలుకుబడి ఉన్నా పట్టుకోండి
పర్యావరణ పరిరక్షణకు నాలుగు విభాగాలు
ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగండి
అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశాలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో ఎట్టి పరిస్థితుల్లో కలప స్లగ్లింగ్‌కు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పోలీసుల సహకారంతో కలప స్మగ్లరపై ఉక్కుపాదం మోపాలని, తరచూ స్మగ్లింగ్‌కు పాల్పడే వారి పై పి.డి. యాక్టు నమోదు చేయాలని చెప్పా రు. కలప స్మగ్లర్లు ఎంతటి వారైనా, ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తయినా, ఏ రాజకీయ పార్టీకి చెందినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ర్టంలో పర్యావరణ పరిరక్షణను నాలుగు విభాగాలుగా విభజించుకొని చర్య లు తీసుకోవాలని చెప్పారు. రాష్ర్ట వ్యాప్తంగా కోట్లాది మొక్కల పెంపకం, అడవి పునరుద్ధరణ, హైదరాబాద్ నగరం లోపలా, బయటా పచ్చదనం పెంచడం, కలప స్మగ్లింగ్ అరికట్టడంపై కార్యాచరణ రూపొందించుకుని రం గంలోకి దిగాలని సిఎం సూచించారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభు త్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, పిసిసిఎఫ్ పి.కె.ఝా, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణారావు, రాజీవ్ త్రివేది, నిరంజన్ రావు, స్మితాసబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పలువురు అటవీశాఖ,పోలీస్ అధికారులు పాల్గొన్నారు. “అడవుల్లో సహజంగా చెట్లు పెరుగుతాయి. అడవుల ద్వారా లభించే పచ్చదనమే ఎక్కువ. ఓ వైపు అడవులు నశించిపోతుంటే, హరితహారం లాంటి కార్యక్రమాల ద్వారా ఎన్ని చెట్లు పెంచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అడవులను కాపాడితే పచ్చదనం కాపాడినట్లే. అడవులను కాపాడడమంటే, భూమిధర్మాన్ని కాపాడినట్లే. కలప స్మగ్లింగ్ వల్ల అడవులకు పెద్ద ముప్పు వాటిల్లుతుంది. రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నది. కొందరు కలప స్మగ్లింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి ప్రాంతాలను, వ్యక్తులను గుర్తించాలి. అక్కడ నిబద్ధత కలిగిన అధికారులను నియమించాలి. కలప స్మగ్లింగ్ అరికట్టడమే లక్ష్యంగా వారు పనిచేయాలి. పోలీసుల సహకారంతో అటవీశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించాలి. సాయుధ పోలీసుల అండతో కలప స్మగ్లింగ్ ను నూటికి నూరు శాతం అరికట్టాలి. కలప స్మగ్లింగుకు పాల్పడే వారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దు. కఠిన చర్యలు తీసుకోవాలి. వారికి సహకరించే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు ఎవరైనా స్మగ్లింగ్ కు పాల్పడినా వదిలిపెట్టవద్దు, టిఆర్‌ఎస్ నాయకులు ఎవరైనా ఈ పనిచేస్తే ముందు వారిపైనే చర్యలు తీసుకోండి. గతంలో నక్సలైట్ల కారణంగా అడవుల్లోకి వెళ్లడం సాధ్యం కావట్లేదు అని సాకులు చెప్పేవారు.