వైద్య సేవ నుంచి ప్రభుత్వం వైదొలుగుతుందా?
ప్రైవేటుకు అనుమతితో బలపడుతున్న అనుమానాలు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : కరోనా కోరలు చాచింది. ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనా వ్యాప్తి వేగం గా జరుగుతుంది. ప్రాథమిక దశలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పాలకులు కారణాలు ఏమైనా క్రమేపీ పట్టు సడలించారు. ఇప్పుడు నగరాలను భయపెడుతున్న కరోనా పల్లెలకు పాకితే ఏమిటన్న ప్రశ్న భయాందోళనకు దారితీస్తుంది. ఇదే సమయంలో ప్రభుత్వాలు కరో నా వైద్య సేవల నుంచి క్రమేపీ వైదొలగుతున్నా యి. కరోనా పరీక్షలు, ఇతర వైద్య సేవలను ప్రైవేటుకు అప్పగించడంతో ప్రభుత్వ పరంగా కరోనా సేవలను వదిలేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌గా తేలిన ప్రతి ఒక్కరికీ ప్రస్తుతం ప్రభుత్వపరంగానే పూర్తి వైద్య సాయం అందిస్తున్నారు. పరీక్షలను సైతం ప్రభుత్వ పరంగానే చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రైవేటుకు అనుమతించడమంటే సామాన్యులను, పేదలను కరో నా వైద్య సాయానికి దూరం చేయడమే. ప్రజల అనుమానాలకు తగినట్లు గా ప్రభుత్వం కరోనా నుంచి వైదొలిగితే భయంకర పరిస్థితులు దాపురించే అవకాశం ఉంది. ఇప్పటికీ లక్షలాది మంది వివిధ రోగాలతో బాధపడుతూ వైద్య సాయం పొందలేక ఇబ్బందులు పడుతూ ప్రాణాలు వదులుతున్నా రు. కానీ కరోనా వైరస్ ఒకరికీ వచ్చిందంటే వరుసగా వ్యాప్తిచెందుతూ ఉం టుంది. ప్రభుత్వ సాయం కాకుండా ప్రైవేటు వైద్యం ద్వారా కరోనాను ఎదుర్కొవాలంటే ఇక భగవంతునిపై భారం వేయడమే. ఇక రాష్ట్ర విషయానికి వస్తే ఎన్ని కోట్లు ఖర్చు అయినా కరోనాను ఎదుర్కొంటామంటూ శాసనసభ సాక్షిగా మాట్లాడిన ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలకు ఇప్పుడు అందిస్తున్న సాయానికి పొంతన లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే తప్ప వైద్య సేవలు చేయడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ కరోనా ఎంత మందికి సోకింది, ఎంత మంది వ్యా ధి నుంచి బయటపడ్డారన్న దానిపై ప్రభుత్వ వైద్యం పొందిన వారు తప్ప మిగతా వారికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. గాంధీ ఆసుపత్రి కేంద్రంగా గత మూడు నెలలుగా వైద్య సేవలను అందించిన ప్రభుత్వం.. బాధితుల సంఖ్య పెరుగుతున్నా కొద్ది వైద్య సేవలను తగ్గిస్తూ వచ్చింది. క్వా రంటైన్ మొదలు అన్నింటా తగ్గింపులే చేశారు. ఇప్పుడు ప్రైవేటుకు అనుమతిచ్చారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ మాదిరి కరోనాకు కూడా ప్రైవేటు వైద్యం చేయించుకోవడమంటే సాధ్యమయ్యే పని కాదు. పైన పేర్కొన్న వ్యా ధులు అంటువ్యాధులు కావు. కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందన్న ప్రచా రం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో కరోనా సోకిన బాధితుడు వైద్యం సాయం పొందకపోతే పరిస్థితి ఏమిటన్నది ఆలోచించడానికే ఇబ్బందికరంగా ఉంది. రూ. 1000 కోట్లు ఖర్చు పెడతాం, మాస్క్ లు లేకుండానే పర్యటిస్తామన్న మాటలు ఆచరణ సాధ్యం కాదన్న విషయం తేలిపోయింది. ఇప్పటికైనా కరోనాకు సంబంధించి ప్రతి జిల్లా కేంద్రం వీ లు పడకపోతే పాత జిల్లా కేంద్రాల్లోనైనా కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేసి పరీక్షలు నిర్వహించే సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవస రం ఉంది. కరోనా నుంచి వైదొలగితే అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎ దుర్కొవాల్సి వస్తుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని ప్రజలు కో రుతున్నారు.