దాదాపు అన్ని దేశాలకు పాకిన కోవిడ్
10 శాతం ప్రజలకు సోకినట్లుగా అనుమానం
బీజింగ్: ‘కొవిడ్ భయం ఇంకా వీడడం లేదు. ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. గత ఏడాది చివర్లో సెంట్రల్ చైనాలో ఉద్భవించిన కారణంగా 1800 మంది మృత్యువాత పడగా, ప్రపంచమంతటా వ్యాపించింది. చైనాలో తాజా గణాంకాల ప్రకారం 70 వేలకు పైగా ప్రజలు ‘కొవిడ్ బారిన పడ్డారు. చైనా ప్రధాన భూభాగం వెలుపల చూస్తే దాదాపు 30 ప్రాంతాల్లో 780 మందికి ఈ మహమ్మారి సోకింది. తైవాన్, ఫిలిప్పీన్స్, హాంగ్‌కాంగ్, జపాన్‌లో ఒక్కరేసి చొప్పున మరణించారు. అదే విధంగా ఏసియా వెలుపల కూడా ఒక మరణం చోటు చేసుకున్నట్లు ఫ్రాన్స్ శనివారం ప్రకటించింది. కాగా సోమవారం నాటికి చైనాలో చైనాలో 70,548 మందికి ‘కొవిడ్ వచ్చింది. మొదటగా ఈ వైరస్ పుట్టుకొచ్చిన హుబయ్ ప్రావిన్స్ రాజధాని వుహాన్, దాని చుట్టు పక్కలనే అత్యధిక మంది ఈ వైరస్ ప్రభావానికి గురయ్యారు. చైనా ప్రధాన భూభాగంలో ఎక్కువగా 1,770 మంది మృతి చెందారు. మృతుల్లో యుఎస్ పౌరుడు కూడా ఉన్నారు. క్రూయీజ్ షిప్ డైమండ్ ప్రిన్సెస్‌లో 355 మంది, ఒక అధికారిని ప్రత్యేక ఉంచగా, 75 మంది సింగ్‌పూర్ వారిని కూడా ప్రత్యేకంగా ఉంచారు. వైరస్ బారినపడిన వారి వివరాలను దేశాల వారీగా పరిశీలిస్తే…. జపాన్ – 59, హంగ్‌కాంగ్‌లో ‘కొవిడ్ బారిన పడిన మృతి చెందిన మహిళ సహా 57, థాయిలాండ్ 34, దక్షిణ కొరియా 30, మలేషియా 22, తైవాన్ 20 (ఒకరు మతి సహా), వియాత్నం 16, ఆస్ట్రేలియా 15, మకౌ 10, భారత్ 3, ఫిలిప్పీన్స్ 3 (ఒకరు మృతి సహా ), నేపాల్ 1, శ్రీలంక 1, కంబోడియా 1, యుఎస్ 15, కెనడా 16, ఫ్రాన్స్ 12 (ఒకరు మృతి సహా), బ్రిటన్ 9, ఇటలీ 3, రష్యా 2, స్పెయిన్ 2, ఫిన్లాండ్ 1, స్వీడన్ 1, బెల్జీయం 1, యునైటెడ్ అరబ్ ఎమిరేటన్స్ 9, ఈజిప్టులో ఒక కేసు నమోదైంది.