HomeNewsBreaking Newsకరోనా విశ్వరూపం

కరోనా విశ్వరూపం

3 లక్షల మార్క్‌ దాటిన పాజిటివ్‌లు
19 లక్షలకుపైగా యాక్టివ్‌ కేసులు
9,281 మందికి సోకిన కొత్త వేరియంట్‌
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. మూడు లక్షల మార్కును దాటేశాయి. ముందురోజు కంటే అధికంగా 12 వెలుగు చూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 16 నమోదైంది. యాక్టివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా 19 లక్షలు దాటాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తాజా ఉధృతికి దోహదం చేస్తుండగా, ఈ వేరియింట్‌ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 9,281కి చేరాయి. క్రితం రోజు కంటే 300లకుపైగా కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, కర్నాటక,కేరళలో ఒమిక్రాన్‌ వ్యాప్తి అధికంగా ఉంది. థర్డ్‌ వేవ్‌ ముఖ్యంగా ఒమిక్రాన్‌ ప్రభావం వల్ల వ్యాప్తి చెందుతోందని, ప్రతి జీనోం సీక్వెన్సింగ్‌ నామూనాను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో 3,17,532 మంది కరోనా బారిన పడ్డారు. క్రితం రోజు కంటే దాదాపు 35 వేల కేసులు ఎక్కవగా బయటపడ్డాయి. 249 రోజుల తరువాత అవే అత్యధికం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,82,18,773కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. 2020, డిసెంబర్‌ 19వ తేదీన దేశంలో కేసుల సంఖ్య కోటి మార్కును చేరగా, 2021,మే 4న రెండు కోట్లు, జూన్‌ 23న మూడు కోట్లు దాటింది. ఒక్క రోజు వ్యవధిలో 491మరణాలు నమోదయ్యాయి. మొత్తం
మృతుల సంఖ్య 4,87,693కు పెరిగింది. కొత్త కేసులు పెద్ద ఎత్తున రికార్డు అవుతుండడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్‌ కేసులున్నాయి. 234 రోజుల తర్వాత ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే ప్రథమం. ఒక్క రోజు వ్యవధిలో 93,051 కేసులు పెరిగాయి. మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 5.03 శాతంగా, ఉంది. జాతీయ రికవరీ రేటు 93.09 శాతానికి పడిపోయింది. క్రితం రోజున దాదాపు 2,23,990 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,58,07,029కి చేరగా, మరణాల రేటు 1.28 శాతానికి తగ్గింది. బుధవారం 19 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రోజువారి పాజిటివిటీ రేటు 16.41 శాతంగా ఉండగా, వారపు పాజిటివిటీ రేటు 16.06 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొత్త మరణాల్లో కేరళలో 1134, మహారాష్ట్రలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా 4,87,693 మరణాలు సంభవిస్తే అందులో మహారాష్ర్టలో 1,41,934, కేరళలో 51,160 కర్నాటకలో 38,486, తమిళనాడులో 37,073, ఢిల్లీలో 25,460, ఉత్తరప్రదేశ్‌లో 22,990, బెంగాల్‌లో 20,193 మంది కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది జనవరి 16న దేశంలో మొదలైన కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 160 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను లబ్ధిదారులకు అందించారు. బుధవారం 73.3 లక్షల మందికి టీకాలు వేశారు. టీకా కార్యక్రమంలో భాగంగా ఈనెల 3 నుంచి నుంచి 15 ఏళ్ల వయస్సు గల వారికి 3.84 లక్షల డోస్‌లను అందించారు. అందులో 50 శాతం మందికి తొలి డోస్‌ అందింది. 10వ తేదీ నుంచి ప్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లకు పైబడి రెండవ డోస్‌ వేసుకుని 9 నెలల దాటిన వృద్ధులకు కూడా టీకాలు పంపిణీ వేస్తుండగా, ఇప్పటి వరకు వారికి 61,75,049 ప్రికాషనరీ డోస్‌లను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments