ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో: ఆరుగాలం శ్రమించి పంటను పండించిన రైతన్న గుండెల్లో గుబులు అలుముకుంది. ఓ పక్క వరుణుడు, మరో పక్క కరోనా వైరస్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రబీ సీజన్‌లో సాగుచేసిన వరి పంట చేతికి అందే దశలో వరుణుడు దోబుచులాడుతున్నాడు. ఇప్పటికే జిల్లాలో వారం రోజుల్లో రెండుసార్లు వర్షాలు పడ్డాయి. గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా గాలితో కూడిన వర్షం భాగానే పడింది. ఈ అకాల వర్షాలు ఇంకా పడే అవకాశాలు లేకపోలేదు. వర్షాలు పడితే పంట తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే తాము పండించిన పంటను అమ్ముకుందామనుకుంటే కరోనా వైరస్ వారిని మరింత కలవరపెడుతుంది. కరోనా వైరస్‌తో మార్కెట్‌లో, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పా టుచేసిన కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు జరిగే పరిస్థితులు కూడా కనబడటం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో ఏన్నడు లేని విధంగా సూర్యాపేట జిల్లాలో వరి పంటను రైతులు ఈ రబీ సీజన్‌లో రికార్డు స్ధాయిలో సాగు చేశారు. ఓ పక్క క్రిష్ణమ్మమరోపక్క గోదావరి ఇంకోపక్క మూసీ జలాలు పుష్కలంగా పారడంతో రైతులు 10,4545 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. చేతికి అందిన పంట ఏమవుతుందోననే దిగులు వారిలో మొదలైంది. జిల్లాలో రైతులు ఏన్నడు లేని విధంగా ఈ రబీ సీజన్‌లో వరి పంటను 10,4545 హెక్టార్‌లో సాగు చేశారు. ఈ పంట నేడు చేతికి అందే దశకు వచ్చింది. ఆరుగాలం శ్రమించి పంటను పండించిన రైతన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు. పంట దిగుబడి కూడా భారీగానే వస్తుందనే ఆశతో ఉన్నారు. ఈలోపే ఒక్కసారిగా రైతు గుండెల్లో గుబులు అలుముకుంది. ఒక్క పక్క వరుణుడు, మరోపక్క కరోనా వైరస్ వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత వారం రోజుల నుండి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చింది. ఆకాశమంతా మేఘా వృత్తమై మబ్బులు దోబుచులాడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు జిల్లాలో ఓ మోస్తార్ భారీ వర్షాలు పడ్డాయి. వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా విస్తున్నాయి. దీంతో పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ ప్రభావంతో తాము పండించిన పంటను అమ్ముకునే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఇప్పుడుఇప్పుడే రైతులు తమ పంటను మార్కెట్ల అమ్మకానికి తీసుకోస్తున్నారు. కాగా కరోనా వైరస్‌తో వారం రోజుల పాటు మార్కెట్లకు అధికారులు సెలవు ప్రకటించడం జరిగింది. గత రబీ సీజన్‌లో రైతులు జిల్లాలో 82,473 హెక్టారులో సాగు వరి పంటను సాగు చేయగా ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరను కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా 137 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది.