వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో 4వ స్థానం
24 గంటల్లో కొత్తగా 380 మంది మృతి, 10,667 కేసులు
3,43,091కు చేరిన బాధితులు, 9,900కి పెరిగిన మృతులు
మొత్తం 1,53,178 యాక్టివ్ కేసులు
రికవరీ రేటు 52.46%
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. అదే విధంగా మహమ్మారి మృదంగా న్ని మోగిస్తుంది. ఇటీవల కాలంగా నిత్యం 300లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 24 గంట ల్లో దేశ వ్యాప్తంగా 380 మంది కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 9,900 లకు చేరుకుంది. ఇక కేసుల సంఖ్య కూడా రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజుల నుంచి వరుసగా 10 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు భారత్‌లో కొత్తగా 10,667 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,091కి పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం 1,53,178 యాక్టివ్ కేసులు ఉండగా, 1,80,012 మంది కరోనావైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత్‌లో రికవరీ రేటు 52.46గా ఉన్నట్లు మంత్రిత్వశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం దేశంలో బాధితుల సంఖ్య కంటే కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యే అధికంగా ఉండడం కాస్త ఊరట కలిగిస్తుంది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాల్గొవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా, వరుసుగా రెం డు, మూడు స్థానాల్లో బ్రెజిల్, రష్యా ఉన్నాయి. అదే విధంగా మరణాల్లో భారత్ 8వ స్థానానికి ఎగబాకిటన్లు జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. తాజాగా మరణాల సంఖ్యలో భారత్ బెల్జియంను దాటేసింది. సోమవారం ఉదయం నుంచి మహారాష్ట్రలో కొత్తగా 178 మంది మరణించగా, ఢిల్లీలో 73, తమిళనాడులో 44 మంది, గుజరాత్‌లో 28, హర్యానాలో 12, పశ్చిమ బెంగాల్‌లో 10, రాజస్థాన్‌లో 9, మధ్యప్రదేశ్‌లో ఆరుగురు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లో నలుగురు చొప్పున, జమ్మూకశ్మీర్, కర్నాటకలో ముగ్గురకు చొ ప్పున, తెలంగాణలో ఇద్దరు, బీహార్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలో కొరు చొప్పున మరణించారు. ఇదిలా ఉండ గా, ఇప్పటి వరకు సంభవించిన మొత్తం 9,900 మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా 4,128 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. మరణాల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో ఉన్న గుజరాత్‌లో 1,505, ఢిల్లీలో 1,400, పశ్చిమ బెంగాల్‌లో 485, తమిళనాడులో 479, మధ్యప్రదేశ్‌లో 465, ఉత్తరప్రదేశ్‌లో 399, రాజస్థాన్‌లో 301, తెలంగాణలో 187, హర్యానాలో 100, కర్నాటకలో 98, ఆంధ్రప్రదేశ్‌లో 88, పంజాబ్‌లో 71, జమ్మూకశ్మీర్‌లో 62, బీహార్‌లో 40 మంది, ఉత్తరాఖండ్‌లో 24 మంది, కేరళలో 20 మంది, ఒడిశాలో 11 మంది, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అసోంలో 8 మంది చొప్పున, చండీగఢ్‌లో ఆరుగురు, పుదుచ్చేరిలో ఐదుగురు, మేఘాలయ, త్రిపుర, లడఖ్‌లో ఒకరు చొప్పు మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని పేర్కొంది. ఇక రాష్ట్రాల వారీగా కేసులు చూస్తే అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 1,10,744 కేసులతో రాష్ట్రం దేశంలోనే తొలి స్థా నంలో కొనసాగుతుంది. తమిళనాడులో 46,504 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 42,829, గుజరాత్‌లో 24,055, ఉత్తరప్రదేశ్‌లో 13,615, రాజస్థాన్‌లో 12,981, పశ్చిమ బెంగాల్‌లో 11,494, మధ్యప్రదేశ్‌లో 10,935, హర్యానాలో 7,722, కర్నాటకలో 7,213, బీహార్‌లో 6,650, ఆంధ్రప్రదేశ్‌లో 6,456, జమ్మూకశ్మీర్‌లో 5,220, తెలంగాణ లో 5,193, అసోంలో 4,158, ఒడిశాలో 4,055, పంజాబ్ లో 3,267, కేరళలో 2,543, ఉత్తరాఖండ్‌లో 1,845, జార్ఖండ్‌లో 1,763, ఛత్తీస్‌గఢ్‌లో 1,756, త్రిపురలో 1,086 మంది కి కరోనా సోకింది. అదే విధంగా గోవాలో 592 మంది, హి మాచల్‌లో 556 మంది కొవిడ్ 19 బారిన పడ్డారు. లడఖ్ లో 555, మణిపూర్‌లో 490, చండీగఢ్‌లో 354, పుదుచ్చేరిలో 202, నాగాలాండ్‌లో 177 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఇక మిజోరాంలో 117, అరుణాచల్‌లో 91, సి క్కింలో 68, మేఘాలయలో 44 కేసులు, అండమాన్ నికోబార్‌లో 41, దాదర్ నగర్ హవేలీ, దామన్ డియోలో 36 కేసులు నమోదయ్యాయి. మరో 7,684 కేసులుకు సంబంధించి రాష్ట్రాలు వెల్లడిస్తాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.