ప్రజాపక్షం/హైదరాబాద్ బాలల హక్కుల సంఘం అధ్యక్షులు పి.అచ్యుతరావు(58) కొవిడ్ బారిన పడి బుధవారం మరణించారు. హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. అచ్యుతరావును వెంటిటేలర్‌పై ఉంచి కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గతంలో ఆయన బాల సంఘం, ఎఐఎస్‌ఎఫ్‌లో క్రియాశీలకంగా పని చేశారు. అనంతర కాలంలో బాలల హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసి, వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులుగా కూడా కొంత కాలం ఉన్నారు. ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్‌కు ఆయన సోదరుడు.
సిపిఐ సంతాపం హక్కుల సంఘం అధ్యక్షులుగా పని చేసిన అ చ్యుతరావు మరణం పట్ల సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధా కర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎపి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలియజేశారు. అచ్యుతరావు అకాలమరణం విషాదకర వార్త అని సురవ రం పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులు, సోదరుడు, ప్రముఖ కార్టూని స్టు శ్రీధర్ కూడా కొవిడ్ మహమ్మారి బారిన పడ్డారని, వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కొవిడ్ బారిన పడి ఆయన మరణించడం బాధాకరమని చాడ పేర్కొన్నారు. అచ్యుతరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అచ్యుతరావును కొవిడ్ రక్కసి కబళించడం బాధాకరమని నారాయణ అన్నారు. సామాజిక కార్యకలాపాల లో, ముఖ్యంగా బాలల సంరక్షణ, హక్కుల విషయంలో చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. అచ్యుతరావు సేవలు మరువలేనివని, ఆయ న లేని లోటు తీరనిదని తెలిపారు. వారి కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అచ్యుతరావు నిరంతరం కృషి చేశారని, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేక చట్టం కోసం పాటుపడ్డారని రామకృష్ణ తెలి పారు.
కరోనా బారినపడి బాలల హక్కుల సంఘం అధ్యక్షులుఅచ్యుతరావు మృతి
RELATED ARTICLES