న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 84కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత చికిత్స తీసుకుని కోలుకున్న ఏడుగురిని డిశ్చార్జి చేసినట్లు ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అందులో ఉత్తరప్రదేశ్ నుంచి ఐదుగురు, రాజస్థాన్, ఢిల్లీ నుంచి చెరొకరు చొప్పున కోలుకున్న అనంతరం డిశ్చార్జి అయినట్లు వివరించారు. కరోనా పాజిటివ్ అని తేలిన 84 మందితో సన్నిహితంగా మెలిగిన 4వేల మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన విమానం శనివారం అర్ధరాత్రి ముంబయికి చేరుకుంటుందని తెలిపారు. ఇటలీ నుంచి భారతీయ విద్యార్థులను తెచ్చేందుకు శనివారం ఎయిరిండియా విమానం బయల్దేరనుందని చెప్పారు. కాగా, కరోనా వైరస్ వల్ల భారత్‌లో ఇద్దరు మృతి చెందా రు. ఇటీవల సౌదీ అరేబియా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన కాలబురిగికి చెందిన 76 ఏళ్ల వ్యక్తి గురువారం మరణించాడు. అదే విధంగా వైరస్ సోకిన ఢిల్లీలోని 68 ఏళ్ల వృద్ధురాలు రామ్ మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఇప్పటి వరకు ఢిల్లీలో ఏడు పాసిజిటవ్ కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 11 కేసులు నమోదు కాగా, కర్నాటకలో ఆరుగురికి, మహారాష్ట్రలో 14 మందికి, లఢక్‌లో ముగ్గురికి, జమ్మూకశ్మీర్‌లో ఇద్దరికి కరోనా వైరస్ వచ్చింది. అదే విధంగా రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లో ఒక్కొక్క కేసు నమోదైంది. కేరళలో అత్యధికంగా 19 కేసులు నమోదయ్యాయి. అందులో గత నెలలో వైరస్ సోకి ప్రస్తుతం తగ్గిపోయి ఆసుపత్రి నుంచి ముగ్గురు కూడా ఉన్నారు.16 మంది ఇటలీ పర్యాటకులు, ఒక కెనాడా దేశస్థుడు మొత్తం 17 మంది విదేశీయులు సహా భారత్‌లో 84 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.అన్ని రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిఘా, దిగ్బంధం, ప్రత్యేక వార్డులు, శిక్షణ పొందిన సిబ్బంది,ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వంటి అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రత్యే క కార్యదర్శి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. కరోనా వైర స్ భయం వల్ల నిత్యావసర వస్తువులకు కొరత సృష్టించ డం, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల చట్టం కింద ఎన్ 95 సహా మాస్కులు, చేతి శానిటైజర్లను నిత్యావసర వస్తువులుగా శుక్రవారం ప్రభు త్వం ప్రకటించింది. ఈ వస్తువులు జూన్ నెలాఖరు వర కు నిత్యాసర వస్తువులుగా పరిగణించనున్నారు. నోవల్ కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు.
పద్మ పురస్కారాలు వాయిదా
కరోనా భయాల నేపథ్యంలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదాపడింది. అంతకంతకూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఏప్రిల్ 3న జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది పలు రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి. పద్మ విభూషణ్ అవార్డు ఏడుగురిని వరించగా.. పద్మభూషణ్ 16 మందిని.. 118 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి.
బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ
ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కరోనావైరస్ సోకకుండా ముంద స్తు చర్యల్లో భాగంగానే భవనాన్ని ఖాళీ చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కొంత మంది సభ్యులకు కరోనా సోకినట్లు అనుమానం కలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ దేశ్‌పాండే పేర్కొన్నారు.
అంతర్జాతీయ సరిహద్దులో 15 నుంచి స్క్రీనింగ్
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నివారణ చర్యలు వేగవంతం చేసింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆంక్షలు విధిస్తూ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. సరిహద్దుల వద్ద తనిఖీలు తప్పనిసరి చేసింది.మార్చి15 నుంచి ప్రయాణికుల కదలికలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.అసోం, బీహార్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బంగాల్ రాష్ట్రాల సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సరిహద్దులు దాటుతున్న వారిపై నిఘా పెంచాలని పేర్కొం ది. ఆ దేశాల సరిహద్దులు మూసివేత..బంగ్లాదేశ్, నేపా ల్, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దులను దాదాపు మూసివేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.ఈ ప్రాంతాల్లోని పలు చోట్ల ఉన్న ప్రవేశ మార్గాలను కుదిం చి ఒకే ప్రాంతానికి పరిమితం చేయాలని ఆదేశించిం ది. ఎంపిక చేసిన చెక్‌పోస్ట్‌ల నుంచే దేశంలోకి ప్రవేశాలను అనుమతించాలని తెలిపింది. వీటిద్వారా వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది.అనుమతి ఉన్న పోర్టుల నుంచే..అనుమతించిననౌకాశ్రయాల నుంచి మాత్రమే ప్రయాణీకులు రావాల్సి ఉంటుందని, వచ్చే ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా కరోనా స్క్రీనింగ్‌కు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
కరోనా పాజిటివ్ కేసులు @ 84
RELATED ARTICLES