HomeNewsLatest Newsకరోనా ను అడ్డుకుంటున్న పల్లె ప్రగతి స్ఫూర్తి

కరోనా ను అడ్డుకుంటున్న పల్లె ప్రగతి స్ఫూర్తి

కరోనా ను అడ్డుకుంటున్న పల్లె ప్రగతి స్ఫూర్తి

సమస్టీ కృషి నేర్పిన పాఠం.. కరోనా పై ఉపయోగం

సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఈ ఫలితాలు

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

ప్ర‌జాప‌క్షం/హైదరాబాద్ : కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రజలు సమస్టీగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలు స్ఫూర్తినిచ్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

గ్రామాల్లో సమగ్రాభివృద్ధికి, శుభ్రత కోసం ప్రజలందరూ సమస్టీగా కదిలి చేసిన కృషి అనుభవం.. కరోనా వైరస్ పై యుద్దానికి ఉపయోగపడిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమాలలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో సర్పంచ్ లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, యువజన సంఘాలు, మహిళలు, పెద్దలు, ప్రజలు విశేషంగా కృషి చేస్తున్నారని వినోద్ కుమార్ వివరించారు.

కరోనా మహమ్మారి గ్రామాల్లో కట్టడిగా ఉంటే.. పట్టణాలు తట్టుకుంటాయని వినోద్ కుమార్ అన్నారు.

ప్రతి అంశంలోనూ గ్రామాలు .. పట్టణాలు, నగరాలకు ఆదర్శమని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందన్నారు.

ఏ కోణంలో చూసినా .. ప్రతి అంశంలో సీఎం కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న కార్యక్రమాలు మన కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తున్నాయని వినోద్ కుమార్ వివరించారు.

పల్లె ప్రగతి కార్యక్రమాల్లో గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా కదిలిన తరహాలోనే.. కరోనా పై కూడా అదే స్పూర్తితో సమస్టీగా నియంత్రణ చర్యలు చేపడుతున్నారని వినోద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ గ్రామాలకు, కాలనీల్లో వ్యాప్తి చెందకుండా ఆయా ప్రాంతాల వాసులు బయటి వ్యక్తులు రాకుండా దిగ్భంధనం వంటి కార్యక్రమాలు చేపడుతుండటం హర్షణీయమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి ని అంతమొందించే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

రాబోయే రోజులు మరింత క్లిష్ట తరమైనవని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కఠినమైన దీక్షతో వ్యవహరించి కరోనా వైరస్ ను పారదోలేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

కరోనా కట్టడిలో దేశానికి స్ఫూర్తినిస్తున్న తెలంగాణ

ఇది సరిపోదు – ఇంకా కఠినంగా ఉండాలి

వ్యక్తిగత క్రమశిక్షణ ముఖ్యం

ఫలితాలిస్తున్న సీఎం కేసీఆర్ ముందస్తు చర్యలు

వైద్యులు, మెడికల్, పారిశ్యుద్ధ్య సిబ్బంది, మీడియా, పోలీసు, ప్రజల పాత్ర మరువలేనిది

శల్యూట్ తెలంగాణ

# రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి స్ఫూర్తినిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

అందుకు వైద్యులు, మెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా, పోలీసు, అన్ని ఉద్యోగ శ్రేణులు, కార్మిక, కర్షక వర్గాలు, ప్రజలు కలిసికట్టుగా, కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

అన్ని వర్గాలు, ప్రజల ఐక్యత చూస్తుంటే శల్యూట్ తెలంగాణ అని నోరారా చెప్పకుండా ఉండలేకున్నానని వినోద్ కుమార్ తెలిపారు.

కరోనా వైరస్ ను తుదముట్టించే దాకా ఎవరూ విశ్రమించకూడదని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

కరోనా వైరస్ పట్ల ఇప్పటి వరకు అమలు చేస్తున్న చర్యలు సరిపోవని, ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్ మహమ్మారి దరి చేరకుండా ఎవరికి వారు వ్యక్తిగత క్రమశిక్షణను పాటించడం అత్యంత ముఖ్యమైన అంశమని వినోద్ కుమార్ అన్నారు.

పొరపాటున కూడా ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

కఠినతర స్వీయ నియంత్రణే మానవాళికి శ్రీరామ రక్ష అనే వాస్తవాన్ని ఎవరూ విస్మరించవద్దని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని వినోద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అందుకు అన్ని వర్గాలు అండగా నిలవడం హర్షణీయమన్నారు.

ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ.. కరోనా వైరస్ పట్ల అత్యంత జాగరుకతతో ఉండాలని, కరోనా వైరస్ అంతం చూసే దాకా ఎవరూ విశ్రమించకూడదని బోయినపల్లి వినోద్ కుమార్ ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments