పరీక్షకు హాజరుకానున్న 15.97లక్షల మంది విద్యార్థులు
న్యూఢిల్లీ : వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం జాతీయస్థాయిలో జరిగే నీట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టిఎ) కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టింది.భౌతికదూరం నిబంధన పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల సంఖ్య 2,546 నుంచి 3,834కు పెంచా రు. ఒక్కో గదిలో విద్యార్థుల సంఖ్యను 24 నుంచి 12కు తగ్గించారు. గతంలో 2 సార్లు వాయిదా పడిన నీట్‌కు దేశవ్యాప్తంగా 15.97లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. బార్ కోడ్ ద్వారా హాల్‌టికెట్ల
పరిశీలన, పరీక్ష కేంద్రాల పెంపు, ప్రత్యామ్నాయ సీటింగ్, పరీక్ష గదిలో విద్యార్థుల సంఖ్య తగ్గింపు, విద్యార్థుల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల్లో తగిన చర్యలు తీసుకున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది. పరీక్ష కేంద్రాల వద్ద, పరీక్ష హాల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు మాస్క్ ధరించి రావటంతోపాటు శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత అధికారులు ఇచ్చే మాస్క్‌లు ధరించాలని సూచించారు.
కరోనా జాగ్రత్తలతో నేడు నీట్ పరీక్ష
RELATED ARTICLES