నేడు మహిళ టి20 ప్రపంచకప్ ఫైనల్
ఆశలన్నీ షెఫాలీ.. పూనమ్‌లపైనే
పటిష్టంగా ఆస్ట్రేలియా మహిళల జట్టు
మహిళాదినోత్సవం.. హర్మన్ పుట్టిన రోజు.. కానుకగా కప్పు అందించేనా..?
మధ్యాహ్నం 12:30 నుంచి స్టార్‌స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం
మెల్‌బోర్న్ : యావత్ భారత దేశం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. మెల్‌బోర్న్ వేదికగా రేపు ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు అతిథ్య ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలిసారి ఫైనల్ చేరిన టీమ్‌ఇండియా.. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆసీస్‌ను ఓడించి కప్ గెలవగలదా.. మహిళా దినోత్సవం రోజున ప్రపంచకప్‌కు గెలిచి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతుంది. కాగా సొంత ప్రేక్షకుల మధ్య ఐదోసారి ప్రపంచ కప్ అందుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం టీమ్‌ఇండియాకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేదే. అయితే ఫైనల్‌లో ప్రత్యర్థి జట్లను బోల్తా కొట్టించి కప్పు గెలవడం కంగారూలను వెన్నతో పెట్టిన విద్య. కాగా వరుసగా ఐదు సార్లు ఫైనల్ చేరి నాలుగు సార్లు కప్పు కొట్టిన ఆస్ట్రేలియా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.
షెఫాలీ.. హర్మన్‌ల రాణిస్తే..
భారత జట్టు ఆశలన్ని యువసంచలనం షెఫాలీ వర్మపైనే ఉన్నాయి. టోర్నీ ఆరంభం నుంచి విధ్వంసక ఇన్నింగ్స్‌లతో జట్టుకు శుభారంభాలను ఇస్తోంది. ఫైనల్‌లోనే షెఫాలీ దూకుడు కొనసాగిస్తే మ్యాచ్ పై భారత్‌కు పట్టు చిక్కినట్లే. మరోఓపెనర్ స్మృతి మంథాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమియా రోడిగ్స్ ఇప్పటి వరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఫైనల్‌లో వీరందరూ సమిష్టిగా రాణించాల్సి ఉంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత జట్టు స్కోర్ 150 పరుగులు కూడా దాటలేదు. అయినప్పటికి భారత బౌటర్లు చక్కగా రాణిస్తున్నారు. స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటూ జట్టును విజయాలను అందిస్తున్నారు. మరో ఓపెనర్ స్మృతి మంధాన ఈ మెగా టోర్నీలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. మంధాన కూడా మెరిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఈమ్యాచ్ ఎంతో ప్రత్యేకం. ఆదివారం 31వ పడిలోకి ఆమె అడుగుపెట్టనుంది. దీంతో తమ క్రికెట్ చరిత్రలోనే అద్భుత విజయంతో ఆ రోజును చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటోంది. అయితే ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న హర్మన్‌ప్రీత్ ఈ కీలక మ్యాచ్‌లో తిరిగి బ్యాట్ ఝుళిపిస్తే విజయంపై నమ్మకంగా ఉండొచ్చు. ఇక జెమిమా రోడ్రిగ్స్ భారీ ఇన్నింగ్స్ భాకీ ఉంది.
పూనమ్ చెలరేగాలి..
ఈ మెగా టోర్నీలో భారత మహిళలు ఒక్కసారి కూడా 150 స్కోర్ చేయలేకపోయారు. అయినా జట్టు విజయాలు సాధించిందంటే అందుకు కారణం బౌలర్లు. స్పిన్నర్ పూనమ్ యాదవ్, పేసర్ శిఖ పాండే భారత విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పూనమ్ యాదవ్ అద్భుతంగా రాణిస్తోంది. ఫైనల్లో కూడా ఈమె చెలరేగితే ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వార్డ్ తమ వంతు సాయం చేస్తున్నారు. భారత్ కప్‌ను ముద్దాడాలంటే ఫైనల్లో అందరూ సత్తాచాటాలి.
ఎదురుదెబ్బలు తగిలినా..
ఇటీవల జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్‌పై ఆసీస్ విజయం సాధించింది. అయితే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో మాత్రం మన చేతిలో ఓటమి చవిచూడటం ఆసీస్‌కు మింగుపడడంలేదు. గాయాలతో ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, పేసర్ తాల్యా వ్లామ్నిక్ జట్టుకు దూరమవ్వడం ఆసీస్‌కు ఎదురుదెబ్బే. కానీ, కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని జయించే అలవాటు ఆసీస్ సొంతం. ఇటీవల జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్‌పై విజయం సాధించింది. అయితే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌సేన చేతిలో ఓటమి చవిచూడటం ఆసీస్‌ను ఆందోళన పెట్టించే విషయం. కానీ, ఆ తర్వాత గొప్పగా పుంజుకొని టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది. తుది పోరులో విజయం సాధించాలంటే సారథి మెగ్ లానింగ్, బెత్ మూనీ, ఎలీసా హీలీ రాణించాలి.
పిచ్ వాతావరణం
మెల్‌బోర్న్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. అయితే తొలుత బౌలర్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తారు. ఆ తర్వాత బంతి బ్యాటుపైకి వస్తుంటుంది. మెగా టోర్నీలో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు మూడు సార్లు, ఛేదనకు దిగిన జట్టు రెండు సార్లు విజయాలను అందుకున్నాయి. వర్షం ముప్పు దాదాపు లేదని సమాచారం.
రేపటి మ్యాచ్‌లో విశేషాలెన్నో..
ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం అటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా ఆసక్తిగానే కాదు.. కాస్త ఉద్వేగంగానూ ఎదురు చూస్తోంది. కారణం.. తన 31వ పుట్టిన రోజు నాడే కెరీర్‌లోనే పెద్ద మ్యాచ్‌ను ఆమె ఆడబోతోంది. అత్యంత అరుదుగా దక్కే ఇలాంటి క్షణాలను ఆస్వాదిస్తూనే.. గెలిచి కప్ కొడితే అంతకు మించిన కానుక కౌర్‌కు ఏముంటుంది. మహిళల క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ అంతంత మాత్రమే. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు స్టేడియాలు నిండడమనేది దాదాపుగా జరగదు. ఈ టోర్నీలో భారత్-ఆసీ్‌స మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌ను తిలకించేందుకు రికార్డు స్థాయిలో 13వేల మంది వచ్చారు. ఆతర్వాత ఎప్పటిలాగే ప్రేక్షకులు తగ్గిపోయారు. కానీ ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే తుది సమరం మహిళల క్రికెట్‌లో చరిత్ర సృష్టించబోతోంది. లక్ష ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన ఈ స్టేడియం దాదాపుగా నిండిపోనుంది. ఇప్పటికే 70వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీంతో కనీవినీ ఎరుగని స్థాయిలో మహిళల క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు అంతా సిద్ధమైంది.
కప్పు కొట్లాట
RELATED ARTICLES