టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీని ప్రకటించిన ఎఐసిసి
ప్రజాపక్షం/హైదరాబాద్ టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీని ఎఐసిసి ఆదివారం ప్రకటించింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాకూర్‌ను చైర్మన్‌గా, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీని కన్వీనర్‌గా నియమించింది. ఈ కమిటీ తక్షణమే అమలులోకి వస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.జి.వేణుగోపాల్ వెల్లడించారు. కమిటీ సభ్యులుగా టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ పిసిసి అధ్యక్షులు వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, సిఎల్‌పి మాజీ నేత కె.జానారెడ్డి, ఎంపిలు ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంఎల్‌సి టి. జీవన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, ఎంఎల్‌ఎలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పోడెం వీరయ్య, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎఐసిసి ఆమోదించిన అన్ని కమిటీల చైర్మన్లు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎఐసిసి కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎఐసిసి కార్యదర్శుల ఇన్‌చార్జ్‌లను సభ్యులుగా నియమించారు.
కన్వీనర్‌గా షబ్బీర్ అలీ చైర్మన్‌గా మాణిక్కం ఠాకూర్
RELATED ARTICLES