మంచిర్యాల జిల్లాలో పరువుహత్య
ప్రజాపక్షం/మంచిర్యాల : రాష్ట్రంలో వరుస పరువు హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తన కూతుర్ని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో అల్లుడిని హతమార్చడం.. ప్రేమించి పెళ్లి చేసుకుని పరువు తీసిందనే కక్షతో కూతుర్నే చంపుకోవడం పరిపాటైంది. ఇదిలా ఉం డగా శనివారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా జన్నా రం మండలం కలమడుగు గ్రామంలో పరువు హత్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కలమడుగుకు చెందిన పిండి అనురాధ (22), అదే గ్రామానికి చెందిన అయ్యోరు లక్ష్మణ్ ప్రేమించుకున్నారు. ఈనెల 3న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. వారిరువురు కలమడుగులోని లక్ష్మణ్ ఇంటికి శనివారం చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అనూరాధ తల్లిదండ్రులు, బంధువులు లక్ష్మణ్ ఇంటికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి అనూరాధను బలవంతంగా తీసుకెళ్లారు. శనివారం రాత్రి అనూరాధను నిర్మల్ జిల్లా మల్లాపూర్ సమీపంలో హతమార్చారు. అనంతరం దహనం చేశారు. లక్ష్మ ణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రా రంభించారు. దీంతో ఈ ఘటన ఆదివారం వెలుగులోకొచ్చింది. అనూరాధ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కులాంతర వివా హం వల్లే ఆమెను హతమార్చామని అనూరాధ తల్లిదండ్రులు చెప్పారని పోలీసులు తెలిపారు.