HomeNewsAndhra pradeshకన్నీటి గోదారి!

కన్నీటి గోదారి!

పాపికొండల్లో పర్యాటక బోటు మునక
8 మృతదేహాలు లభ్యం
మరో 39 మంది గల్లంతు
బాధితుల్లో ఎక్కువమంది తెలంగాణవాసులే
పరిమితికి మించి బోటులోకి ఎక్కించి ముంచారు

ప్రజాపక్షం/ విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండల పర్యాటకంలో పెను విషాదం జరిగింది. గోదావరిలో బోటు ప్రమాదానికి గురై నిండు ప్రాణాలు నీటమునిగాయి. విహారయాత్ర కాస్త విషాదాంతమైంది. అనుమతిలేని బోటు ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. కచులూరు మందం దగ్గర గోదావరి నడిమధ్యన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలవరం మండలం సింగనపల్లి రేవు నుంచి 73 మందితో బయలుదేరిన రాయల్‌ వశిష్ట బోటు… మధ్యలో గండిపోచమ్మ ఆలయం వద్ద ఆగింది. అక్కడే పర్యాటకులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బయలుదేరిన బోటు… దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద… కొండ రాయిని ఢీ కొని నదిలో మునిగిపోయింది. ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. రెండస్థుల బోటులో మొదటి అంతస్థులోని వారు రెండో అంతస్థులోకి వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించిన కారణంగానే.. ప్రమాదం జరిగినట్లు పలువురు చెబుతున్నారు. ఘటనలో.. 26 మంది సురక్షితంగా బయటకు రాగా… 39 మంది ఆచూ కీ గల్లంతైంది. ఇప్పటి వరకూ 8 మృతదేహాలు బయటకు తీశారు. స్థానికులు..లేకపోతే..మరీ దారుణం చోటు చేసుకునేదని అధికారులు తెలిపారు. పర్యటకుల్లో లైఫ్‌ జాకెట్లు ధరించిన వారు నదిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన తూటుగుంట గ్రామస్థులు… పడవల్లో వెళ్లి వారిని రక్షించారు. అనంతరం ఒడ్డుకు చేర్చి వారిని రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. బోటు నిర్వాహకుల నిర్లక్ష్యమే పెను విషాదానికి కారణమని సంఘటన ఆధారంగా తెలుస్తోంది. ఓ వైపు గోదావరి ప్రవాహం జోరుగా ఉన్నా.. నిర్వహకులు స్వార్థంతో పరిమితికి మించి ఎక్కించుకోవడమే దుర్ఘటనకు కారణమైంది. ఉదయం పదిన్నర గంటలకు ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు స్పందించి ఉండకపోతే..ఇంకా ఎక్కువ మంది మృతి చెందే వారని…బాధితుడొకరు తెలిపారు. ఈ ప్రమాద బాధితుల్లో తెలంగాణ వాసులే ఎక్కువమంది. పర్యటకుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం నగరాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 36 మంది బోటులో ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన 22 మంది …వరంగల్‌ నగరానికి చెందిన 14 మంది బోటులో ప్రయాణించారు. వీరిలో ఐదుగురు వరంగల్‌ వాసులు ఒడ్డుకు చేరారు. 9 మంది ఆచూకీ గల్లంతైంది. విశాఖకు చెందిన 9 మంది పడవ ప్రమాదంలో గల్లంతయ్యారు.అందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ఇప్పటికే బాధితుల బంధువులు దేవీపట్నం బయలుదేరారు. బోటు నడిపిన ఇద్దరు డ్రైవర్లు నూకరాజు, తామరాజు సైతం చనిపోయా రు. 10 మృతదేహాలను అధికారులు దేవీపట్నం పోలీస్టేషన్‌కు తరలించారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 26 మంది ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా… 39 మంది ఆచూకీ గల్లంతైం ది. గాయపడిన వారిని రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు తమ వారి జాడ తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయా కుటుంబాల్లో విషాదఛాయాలు అలుముకున్నాయి. సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ్ర పమాద సమాచారం అందించేందుకు అధికారులు టోల్‌ఫ్రీ నంబర్‌ 1800-233-1077 ఏర్పాటు చేశారు. మరోవైపు విశాఖ జిల్లా వాసులు ఉండటంపై కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ స్పందించారు. కలెక్టరేట్‌లో టోల్ఫ్రీ నెంబర్‌-1800 425 00002 ఏర్పాటు చేశారు. సహాయక చర్య లు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సహాయక చర్యలు చేపడుతోంది. విశాఖ నుంచి డోర్నయిర్‌ యుద్ధవిమానంలో సిబ్బందితో పాటు ఏడుగురు గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి బయలుదేరారు. మృతదేహాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పర్యాటక శాఖ అనుమతిలేని రాయల్‌ వశిష్ఠ ప్రైవేటు బోటు వల్లే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోటు మునక దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతయ్యారు. విశాఖకు చెందిన మధపాడ రమణ, అరుణ కుటుంబానికి చెందిన 9 మంది ఆదివారం తెల్లవారు జామున రాజమండ్రి వెళ్లారు. అక్కడ నుంచి బోటులో పాపికొండలు విహార యాత్రకు వెళ్తున్నట్లు బంధువు రామకృష్ణకు సమాచారం ఇచ్చారు. మొత్తం 9 మందిలో ఒక్కరు మాత్రం బ్రతికి ఉన్నారు. మిగిలిన 8 మంది జాడ తెలియాల్సిఉంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments