స్వీయ నిర్బంధమే దీనికి మందు
హైదరాబాద్ : మానవ జాతి పైన కరోనా మహమ్మారి చేస్తున్న విలయ తాండవం చూస్తుంటే అత్యంత బాధాకరం,
ఈ కరోనా మహమ్మారి వల్ల మానసిక,సంక్షోభము,కుటుంబాల మధ్య విచ్ఛిన్నం,ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, ఈ అంటూ రోగం తో అతలాకుతలం అవుతున్నాయి, దేశాలు,రాష్ట్రాలు,కులము,మతము,తెగలు,పేద,ధనిక,అందర్నీ ఆగమాగం చేస్తూ దేశ దేశాలు దాటి మన దేశం పైన పడింది,ఇది గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,వెంటనే నివారణ చర్యలు చేపట్టింది,మన రాష్ట్ర ప్రభుత్వం కూడ వెంటనే నివారణ చర్యలు చేపట్టింది,ఇది అందరం అభినందించదగిన విషయం
ఇది అంటూ రోగం తొందరగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని,ఇది గొల్సుకట్టు రోగం అని ఎక్కడికక్కడ దీన్ని నిర్వీర్యం చేయాలని,
lockdown కు పిలుపునివ్వడం జర్గింది,ప్రజలు ఎవరి ఇంట్లో వాల్లు ఉండాలని, పరిశుభ్రత పాటించాలి, మూతులకు మస్కులు, చేతులు కలుపుకో వద్దని అలైబలై లు వద్దని హెచ్చరిస్తూ వస్తున్నారు, ఈ కరోనా వైరస్ అతి తీవ్రమైన వైరస్ అని దీనికి నివారణ సామాజిక దూరం మనుషుల మధ్య దూరం వల్ల దీని నివారణ సాధ్యం అని పదే పదె చెప్పిన, కర్ఫ్యూ విధించిన,వినకుండా ప్రజలు రోడ్ల మీద కు రావడం,వారి నిర్లక్ష్యానికి వారి అఙ్ఞానికి నిదర్శనం,
చైనా లో పుట్టి ప్రపంచ దేశాల పుట్టి ముంచుతుంది
ఈ కరోనా మహమ్మారి, ఇటలీ దేశానికి పాకిన ఈ వైరస్
అక్కడ శవాల గుట్టలు, కన్నీటి పుటలు,కారణం అక్కడ ప్రజల నిర్లక్ష్యం, అక్కడ ప్రభుత్వాలు ఎంత హెచ్చరించిన పెడచెవిన పెట్టిన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, ప్రపంచలో ఉత్తమ వైద్య సేవలు ఉండి కూడ ఏమి చేయలేని పరిస్థితి అంటే అర్ధం చేసుకోవచ్చు,కరోనా వైరస్ తీవ్రత, అగ్రరాజ్యం అయిన అమెరికా కూడ ఎం చేయాలో అర్థం కాని పరిస్థితి,
ఒక విషయం గుర్తు చేస్తున్నాను స్వాతంత్ర సమరంలో మన కోసం ఎంతో మంది సమర యోధులు నెలలు నెలలు జైలు జీవితం గడిపారు, తెలంగాణ సాయుధ పోరులో జైలు జీవితాలు గడిపారు, భవిష్యత్ తరాల కోసం,మనం మన కోసం ఒక 21days స్వీయ నిర్బంధం లో తినడానికి తిండి,కొంత నగదు జమ చేస్తాం అని చెప్పిన వినకుండా మనం చేస్తున్నదేమిటి, రోడ్లపైకి రావటం,గుంపులు గుంపులుగా తిరగడం,మన బాధ్యత మరచి బయటకు రావొద్దని చెప్పిన పోలీస్ వారికి సహకరించకుండా మాకేం కాదు అనే దోరణిలో జోక్ లు వేస్తూ తిరుగుతున్నారు ఎవరికి నష్టం ఇది ఆలోచన చేయాలి ప్రజలారా,ఇలానే నిర్లక్ష్యం చేస్తే మనం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది, ఇటలీ పరిస్థితి చూస్తున్నారు కదా,
ఇలానే ప్రజలు వినకుంటే ఏప్రిల్ 15 వరకు కాదు మే నెల మొత్తం కూడ నిర్బంధం తప్పదు తస్మాత్ జాగ్రత.
దయచేసి ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటు గొలుసు కట్టు రోగం అయిన కరొననా కట్టడి చెద్దాం.
మీ శేఖర్ పగిళ్ళ
సింగర్
లచ్చమ్మగుడెం
యాదాద్రి భువనగిరి జిల్లా
9949354207