మూడవ రోజూ మూడు లక్షలకుపైనే పాజిటివ్‌లు
మహమ్మారికి మరో 2,264 మంది బలి
మూడు రోజుల్లోనే దాదాపు 10లక్షల కొత్త కేసులు
అంతకంతకూ పెరుగుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : రెండవ దశ కరోనా వైరస్ భారత్‌లో ఏ మాత్రం కనికరం చూపించడం లేదు. ప్రమాదఘంటికలు మోగిస్తూనే ఉంది. గతంతో పోలిస్తే అత్యంత వేగంతో విరుచుకుపడుతుంది. రోజు రోజుకు పాజిటివ్‌ల సంఖ్య సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలో వరుసగా మూడువ రోజు కూడా 3 లక్షలకుపైగా మందికి కరోనా సోకగా, గత నాలుగు రోజుల నుంచి మృతుల సంఖ్య 2 వేలకుపైగా నమోదవుతుండడం పరిస్థితి తీవ్రత ను కళ్లకు కడుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 25 లక్షల మార్క్‌ను దాటింది. మరోవైపు ఆక్సిజన్ కొరతతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పరీక్షా కేంద్రాల్లో కిట్ల కొరత తీవ్రంగా ఉంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో 3,3,46,786 మం ది మహమ్మారి బారిన పడ్డారు. దేశంలోకి వైరస్ ప్రవేశించినప్పటి నుంచి అవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,66,10,481కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. 2,624 మంది కరోనా కాటుకు బలయ్యారు. తాజా వాటితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 1,89,544కు పెరిగింది. కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. ప్రస్తు తం 25,52,940 యాక్టివ్ కేసులు ఉండగా, మొ త్తం కేసుల్లో ఈ సంఖ్య 15.37 శాతంగా ఉంది. జాతీయ రికవరీ రేటు 83.49 శాతానికి పడిపోయింది. రికార్డుస్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నప్పటికీ కొవిడ్ బారి నుంచి బయటపడుతున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుండడం కాస్త ఊరటనిస్తుంది. ఒక్క రోజు వ్యవధిలో 2.19 లక్షల మంది వైరస్‌ను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,38,67,997 కు చేరగా, మరణాల రేటు 1.14 శాతానికి పడిపోయింది. ఇప్పటి వరకు దేశంలో 27,61,99, 222 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది. శుక్రవారం 17,53, 569 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
74.15 కొత్త కేసులు పది రాష్ట్రాల్లోనే..
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. భారత్‌లో తొలి 10లక్షల కేసులు నమోదవడానికి దాదాపు 150 రోజులు పట్టగా.. రెండో దశలో కేవలం మూడంటే మూడు రోజుల్లోనే దాదాపు 10 లక్షల కొత్త కేసులు వెలుగుచూడటం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. గడిచిన 72 గంటల్లో దేశంలో 10 లక్షల కొత్త కేసులు నమోదవగా.. దాదాపు 7వేల మరణాలు సంభవించడం భయాందోళనకు గురిచేస్తోంది. మూడు రోజుల క్రితం దేశంలో తొలిసారిగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. ఏప్రిల్ 21 ఉదయం 8 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో 3,14,835 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత వరుసగా రోజువారీ కేసులు 3.32లక్షలు, 3.46లక్షల పైనే నమోదయ్యాయి. కాగా, కొత్త కేసుల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లో 74.15 శాతం కేసులు రికార్డు అయినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ముఖ్యంగా 12 రాష్ట్రాలు… మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, ఛత్తీసగఢ్, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో రోజువారీ కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 66,836 మంది వైరస్ బారినపడ్డారు. ఢిల్లీలోనూ 24,331 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుతుండడంతో యాక్టివ్ కేసుల గ్రాఫ్ పెరిగిపోతోంది. దేశంలో ప్రస్తుతం 25 లక్షల మార్క్‌ను దాటగా, 17లక్షలకు పైగా (66.66 శాతం) కేసులు మహారాష్ట్ర, ఛత్తీసగఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, గుజరాత్, కేరళలోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 6.93 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. అలాగే, దేశంలో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఇప్పటివరకు కరోనా విలయానికి బలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా 2,624 మందికి మృతి చెందగా, మహారాష్ట్రలో అత్యధికంగా 773 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఢిల్లీలో 348 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 219 మంది, యుపి 196, కర్ణాటక 190, గుజరాత్ 142, తమిళనాడు 78, పంజాబ్ 75, మధ్యప్రదేశ్ 74, రాజస్థాన్ 64 చొప్పున కొవిడ్ కారణంగా మృతిచెందారు. మరోవైపు, 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణమూ నమోదు కాలేదని కేంద్రం తెలిపింది.
13.54 కోట్ల మందికి వ్యాక్సినేషన్
ఒకవైపు దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 13.83 కోట్ల మందికి టీకాలు వేశారు. అందులో 92,68,027 మంది ఆరోగ్య కార్యకర్తలు, 1,18,51,655 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోస్ తీసుకోగా, 59,51,076 మంది ఆరోగ్య కార్యకర్తలు, 61,94,851 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు రెండవ డోస్ తీసుకున్నారు. వీరే కాకుండా 45 ఏళ్ల వయస్సుగల వారు 4,66,71,540 మంది మొదటి డోస్ తీసుకోగా, 21,32,080 మంది రెండవ డోస్ తీసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 4,91,45,265 మంది మొదటి డోస్ తీసుకోగా, 71,65,338 మంది రెండవ డోస్ వేయించుకున్నారు. దేశంలో జనవరి 16 తేదీన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, 98 రోజైన శుక్రవారం 29,01,412 మందికి టీకాలు వేశారు.
కనికరం లేకుండా కాటు
RELATED ARTICLES