జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ
సమస్యలు పరిష్కరించాలని రెండోరోజూ నిరసన
సమస్యలపై ప్రభుత్వ దాటివేత దోరణే సమస్యకు కారణం
8 నెలలుగా పరిష్కారానికి జూడాల ఎదురుచూపు
విపత్కర కరోనా సమయంలో ఒత్తిడి పెంచేందుకు సమ్మె
ప్రజాపక్షం/హైదరాబాద్ / వరంగల్ బ్యూరో
తమ సమస్యలు పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డారక్టర్లు (జూడా) సమ్మెను గురువారం విరమించారు. వెంటనే విధుల్లోకి చేరనున్నుట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్స్ ప్రకటించింది. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో రోగు ల పరిస్థితులు, వారి ఆరోగ్యమే తమ ప్రథమ ప్రాధాన్యత అని, వారికి సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తూ, సిఎం కెసిఆర్, అధికార యంత్రంగం ఇచ్చిన హమీ మేరకు విధులకు హాజరువుతున్నట్లు జూడా అసోసియేషన్ వెల్లడించింది. కాగా 26వ తేదీన( బుధవారం) సాధారణ సేవలను, గురువారం నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు. దీంతో జూడాలతో గురువారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎ ఎమ్ రిజ్వీతో పాటు వైద్య ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు ఫలించాయి. ఫలితంగా జూడా లు రాత్రి 9 గంటల నుంచే వారు విధుల్లో చేరా రు. అంతకుముందు హైదరాబాద్‌లోని బిఆర్‌కెఆర్ భవన్‌లో వైద్య శాఖ ఉన్నతాధికారులతో జూడాలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వారు తమ న్యాయమైన డిమాండ్లపై లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు. ఇందులో కొన్ని హామీలకు అధికార యాంత్రాంగం అంగీకరించలేదు. ఎక్స్‌గ్రేషియా విషయంలో కొంత స్పష్ట త రాలేదు. చర్చల అనంతరం ప్రభుత్వ ప్రతిపాదనలు తదితర అంశాలపై జూడా కార్యవర్గంలో చర్చించారు. ప్రధానంగా గౌరవ వేతనం పెంపు అమలు, కొవిడ్ సోకిన జూడాలకు, వారి కుటుం బ సభ్యులకు నిమ్స్ ఆస్పత్రిలో బెడ్స్‌ను కేటాయింపు అంశాలపై స్పష్టత వచ్చినప్పటికీ ఎక్స్‌గ్రేషియా విషయంలో ప్రభుత్వం తరపున స్పష్టత రాలేదని, ఈ విషయమై సిఎం కెసిఆర్‌తో చర్చించిన తర్వాత సానుకూలమైన నిర్ణయం తీసుకుంటమాని వైద్య ఆరోగ్య శాఖ జూడాలకు హమీనిచ్చింది. దీనికి తోడు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడడం ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ సమ్మెను విరమించాలని జూడాలు నిర్ణయించారు.
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంపు
ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చిన మేరకు సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనాన్ని 15 శాతం వైద్య,ఆరోగ్య శాఖ పెంచింది. జూడాలతో వైద్యశాఖ ఉన్నతాధికారుల చర్చల అనంతరం సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనాన్ని రూ. 70 వేల నుంచి రూ.80,500 లకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు రోజుల సమ్మె& ఆందోళనలు & సుఖాంతం
రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె రెండు రోజుల పాటు జరిగింది. ప్రధానంగా వరంగల్‌లోని ఎంజిఎంతో సహా హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాలలో ప్రభుత్వ ఆసుపత్రులలో జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించారు. గురువారం కరోనా సేవలు మినహా అన్ని సేవలను వారు బహిష్కరించి కొన్ని నెలలుగా కుటుంబాలకు దూరంగా ఉంటున్నా తమ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంజిఎం ఆసుపత్రిలో విధులు బహిష్కరించిన జూడాలు క్యాజువాలిటీ విభాగం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా తదితర ఆసుపత్రుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
డిమాండ్లపై దాటివేత దోరణే సమ్మెకు కారణం
గడిచిన ఎనిమిది నెలలుగా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం, ప్రభుత్వం అనుమతించి, ప్రకటించిన వాటిని సైతం అమలు చేయకుండా జూడాల శ్రమను దోచుకుంటుండడం, జూడాలకు కనీస భద్రత లేకపోవడం తదితర కారణాల వల్లనే సమ్మె చేపట్టాల్సి వచ్చిందని జూడాలు వెల్లడించారు. ప్రభుత్వంతో ఎనిమిది నెలల క్రితం జూడాలు చేసుకున్న ఒప్పందం నేటికీ అమలు కాలేదని, తమ డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్లు ఈ నెల 10వ తేదీన వైద్య విద్య సంచాలకులు రమేష్‌రెడ్డికి నోటీసు ఇచ్చినా పట్టించుకోలేదని, దీనిపై 15 రోజుల పాటు ప్రభుత్వం సాచివేత దోరణి ప్రదర్శిందన్న విమర్వించారు. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో జూడాలు సమ్మె బాట పట్టే సాహసం చేయరని ప్రభుత్వం బావించిందని, అయితే జూడాలు మాత్రం ఇంతటి కష్ట కాలంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నా ప్రభుత్వం కనికరించకుండా నిర్లక్ష్యం వహించిందని జూడాలు అన్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
సమ్మె చేపట్టిన జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్లలో 2020 నుంచి పెంచిన స్టైఫండ్, కొవిడ్ ప్రోత్సాహకాలు ఉన్నాయి. జూడాలకు, సీనియర్ రెసిడెంట్ లకు 15 శాతం స్టైఫండ్ పంపు పెండింగ్ లో వుంది. వైద్యులు, సిబ్బందికి 10 శాతం ఇన్సెంటివ్ ప్రకటించినా అది పెండింగ్ లోనే వుంది. కొవిడ్ విధులను నిర్వహిస్తూ వ్యాధి బారిన పడితే నిమ్స్ లో ఉచితంగా వైద్య సేవలు అందించాలని, ఇతర ఆసుపత్రులలోనూ ఉచిత చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కొవిడ్ విధులను నిర్వహిస్తూ మృతి చెందితే వైద్యులకు రూ. 50 లక్షలు, నర్సు, సపోర్టింగ్ స్టాఫ్ కు రూ. 25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.గతంలో పలు డిమాండ్లపై చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఎనిమిది నెలలుగా అమలు చేయని కారణంగానే ఈ సారి జూనియర్ డాక్టర్లు రాతపూర్వకంగా హామి ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
కథ సుఖాంతం
RELATED ARTICLES