ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణలో కరోనా(కోవిడ్ వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కరోనా నియంత్రణకు, ప్రజల్లో భయాందోళనలు పోగొట్టేందుకు ప్రత్యేక కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కోఠిలోని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనాపై మంత్రి ఈటల కోఠిలోని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలమంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నేటి నుంచి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు నలుగురు ఉన్నతాధి కారులతో నాలుగు ఎక్స్‌పర్ట్ కమిటీలను నియమించినట్లు ఆయన చెప్పారు. ఒక్కోక్క మిటీకి ఒక్కో ఐఎఎస్ అధికారిని కేటాయించాలని సిఎస్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. హిస్పిటల్స్ మెనేజ్‌మెంట్ కమిటీ, సర్వైవల్ కమిటీ, ఐఇసి కమిటీ, ప్రొక్యూర్‌మెంట్ కమిటీలను ఐఎఎస్ అధికారులతో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐఎఎస్ అధికారులు ఎవరనేదీ, వారి పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని వెల్ల డించారు. కమాండ్ కంట్రోల్ 24×7 పనిచేస్తుందన్నారు. ఈ కమాండ్ కంట్రోల్‌కు మంత్రి ఈటల చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు పేర్కొ న్నారు. రాష్ట్రంలో ఎవరికీ కరోనా నేరుగా వైరస్ సోకలేదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ ఇ్చన వారికి మాత్రమే వైరస్ సోకిందన్నారు. తెలంగాణలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం వైద్య సేవలను మరింత పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. ఇందుకుగానూ కేవలం గాంధీ ఆసుపత్రిల్లోనే కాకుండా ఐసోలేషన్ వార్డులున్న పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించేలా అనుమతులిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన వారి రక్తనమూనాలు ఇచ్చే ందుకు గాంధీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలోనే అనుమానితుల శాంపిళ్లు సేకరించి గాంధీకి పంపి స్తే…గాంధీ నుంచి వైద్యపరీక్షల కోసం ఆ శాంపిళ్లను పుణేకు పంపిస్తామని స్పష్టం చేశారు. వైద్యకళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులకు కూడా వైద్య సేవలందించేందుకు ఈ సందర్భంగా ముందుకొచ్చాయని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్రంలోని కామినేని, అపో లో, మమతా, మల్లారెడ్డి, మహావీర్, ప్రతిమ, సాధ న లాంటి ఇతర 600 నుంచి 850 పడకులున్న ప్రైవేట్ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతూ వైద్య పరీక్షల కోసం నమూనాలను గాంధీకి పంపాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ మెడికల్ కాళేజీలన్నీ పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు ముందుకొచ్చాయని ఆయన తెలిపా రు. వైద్యకళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రతి ఆసుపత్రుల్లో 50 బెడ్స్ ఇచ్చేందుకు యాజమాన్యాలు ముం దుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. కోఠి, చెస్ట్, మిలటరీ, వికారాబాద్ చెస్ట్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.