పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ప్రజాపక్షం / హైదరాబాద్ : జిల్లాలు, రిజర్వేషన్ల కేటగిరీల వారీగా జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల ఎంపికలో అభ్యర్థుల కటాఫ్ మార్కులు ప్రచురించాలని తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. రూల్స్‌కు వ్యతిరేకంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం, రిజర్వుడు కేటగిరీ వారికి 55 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేసిన కేసుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఎమ్మెస్ రామచందర్‌రావు సోమవారం ఈ మధ్యంతర ఆదేశాలిచ్చారు. హాల్‌టిక్కెట్ల వారీగా అభ్యర్థులు సాధించిన మార్కు లు సహా పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని, కటాఫ్ మార్కుల విషయంపై తామిచ్చే ఈ ఆదేశాల అమలు గురించి వివరించాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు.