HomeNewsBreaking Newsకంచే చేను మేసింది!

కంచే చేను మేసింది!

దేశ్‌ముఖ్‌ దర్యాప్తులో కీలక సాక్ష్యాన్ని లీక్‌ చేసిన సిబిఐ అధికారి!

న్యూఢిల్లీ : పోలీసు ఉన్నతాధికారి చేతిలో అవినీతి ఆరోపణలకు గురై పదవికి రాజీనామా చేసి అరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కేసులో సిబిఐ అధిపతి సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ చేసిన కీలకమైన వ్యాఖ్యలు బయటకు పొక్కాయి! సిబిఐ సంస్థకు చెందిన అధికారుల ద్వారానే విశ్వసనీయమైన ఆయన ప్రకటన బయటకు పొక్కింది. జైస్వాల్‌ చేసిన కీలకమైన ప్రకటనను రికార్డు చేశారు. రికార్డు చేసిన ఆయన ప్రకటనను ఇటీవలే సాంకేతిక మార్గాల్లో సిబిఐ స్వాధీనం చేసుకుంది. అదెలాగంటే, అరెస్టయిన సిబిఐ ఏజన్సీకి చెందిన అధికారి నుండి, ఆ రాజకీయ నాయకుడి న్యాయవాది నుండి రికార్డు చేసిన ఈ ప్రకటనను స్వాధీనం చేసుకున్నారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన చార్జిషీటులో ఈ విషయం పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టు ఎదుట దాఖలు చేసిన ఈ చార్జిషీలో ఉన్న అంశాల ప్రకారం, దేశ్‌ముఖ్‌ కేసు దర్యాప్తు చేసిన అధికారి రికార్డు చేసిన ఈ ప్రకటనను సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఒక పెన్‌డ్రైవ్‌ లో ఉన్న ఈ ప్రకటనతోపాటు, న్యాయవాది ఆనంద్‌ డాగా ఫోన్‌ను కూడా సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ అభిషేక్‌ తివారీ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. దేశ్‌ముఖ్‌ కేసు విచారణ చేసే అభికారుల బృందంలో తివారీ కూడా భాగంగా ఉన్నారు. డాగాతో కలిసి తివారీ కుట్రకు పాల్పడ్డాడని సిబిఐ ఆరోపించింది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధిచిన సమాచారాన్ని కుప్పకూల్చేసేందుకు అతి సున్నితమైన, రహస్య పత్రాలను బహిరంగ పరిచారని సిబిఐ ఆరోపించింది. బోంబే హైకోర్టు దేశ్‌ముఖ్‌ అవినీతి విచారణ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. కానీ అందులో ఉన్న అధికారులు ఈ విధంగా ప్రవర్తించారు. దీంతో ఈ కేసులో సిబిఐ తివారీని, డాగాను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించింది. ఈ కేసులో సాంకేతిక పరికరాలు కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆ పరికరాలపై ఉన్న వేలిముద్రలు తదితరాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఫోరెన్సిక్‌ విభాగం తన విశ్లేషణను డిజిటల్‌ పరికరంలో నిక్షిప్తం చేసింది. దీనిని తివారీ, డాగర్‌ల నుండి సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిబిఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ సిఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉండగా చేసిన ప్రకటనను తివారీ, డాగా ఇద్దరూ బయటకు పొక్కేలా చేశారు. 2021 మే ఆరో తేదీన సిబిఐ డిప్యూటీ ఎస్‌పి, దేశ్‌ముఖ్‌ కేసులో దర్యాప్తు అధికారి అయిన ముఖేశ్‌ కుమార్‌ టెలిఫోన్‌ ఆధారంగా జైస్వాల్‌ ప్రకటనను రికార్డు చేశారు. కుమార్‌ ఈ ప్రకటనను హార్డ్‌ డ్రైవ్‌లో భద్రపరిచారు. మహారాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌గా ఉండగా దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణల గురించి సిఆర్‌పిసి సెక్షన్‌ 161 కింద జైస్వాల్‌ను ప్రశ్నించారు. ఈ నిజం ఇంకెవ్వరికీ తెలియదు. 2021 ఆగస్టు 1న తివారీ పెన్‌డ్రైవ్‌లో డాక్యుమెంట్లు. డాగా మొబైల్‌ ఫోనులో 2021 ఆగస్టు 5న భద్రపరచి ఉన్నాయని ఫోరెన్సిక్‌ విశ్లేషణ వెల్లడించింది. మహారాష్ట్రకు చెందిన 1985 బ్యాచ్‌ ఐపిఎస్‌ అధికారి జైస్వాల్‌. ఆయన 2021 మే 26న సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబరు 1న సిబిఐ డాగాను, తివారీని అరెస్టు చేసింది. ఈ లీకేజీల వల్ల దేశ్‌ముఖ ప్రధానంగా లబ్ధిపొందారని, ఆయనే చాలా పెద్ద కుట్రకు తెరతీసి ఉంటారని సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పత్రాలు లీక్‌ అవడంపై దేశ్‌ముఖ్‌ పాత్ర ఎంతవరకూ ఉందో తెలుసుకోవాలని న్యాయస్థానం సిబిఐని కోరింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments