ఏప్రిల్ నుంచి 10.7% పెంపు
పారాసెటమాల్‌కు కూడా….
న్యూఢిల్లీ : అన్ని సరుకుల ధరలు పెరిగిపోతున్నాన్నాయి. వంట గ్యాస్, కూరగాయలు, వంటనూనెలు, డిజర్జెంట్ ఇలా అన్నింటి ధర లు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో సామాన్యుడు ధరాఘాతాలతో అల్లాడిపోతున్నాడు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు చెప్పనే అక్కరలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలపై మరో భారం పడనుంది. మెడిసిన్స్ ధరలు భారీగా పెరగనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే 800 రకాల మందులపై వడ్డనకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఒక్కో రకం మెడిసిన్‌పై 10 శాతం కంటే ఎక్కువగా ధరల పెంచనుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఔషధాల ధరల పెరుగుదల రూపంలో వారిపై మరో పిడుగు పడనుంది. జ్వరం, ఇన్ఫెక్షన్లతో పాటు బిపి, గుండె సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, అనీమియా వంటి వాటికి వాడే అత్యవసర ఔషధాల ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నాయని జాతీయ ఔషధాల ధరల సంస్థ (ఎన్‌పిపిఎ) ప్రకటించింది. పలు రకాల మెడిసిన్స్ ధరలు 10.7శాతం పెరగనున్నాయిని పేర్కొంది. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో సహా అవసరమైన మందుల ధరలు ఏప్రిల్ నుండి పెరగనున్నాయి, షె డ్యూల్ చేసిన మందులకు 10 శాతానికి పైగా పెంచడానికి ప్రభుత్వం అనుమతించింది. అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 800 షెడ్యూల్ మందుల ధరలు ఈ మేరకు పెరుగుతాయి. ప్రజలు ఎక్కువగా వాడే పారాసెటమాల్‌తో పాటు ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం,
మెట్రోనిడజోల్, అజిత్రోమైసిన్ వంటి ఔషధాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కరోనా కారణంగా ఔషధాల తయారీ ఖర్చులు కూడా పెరిగాయి. దీంతో వాటి ధరలు పెరగనున్నాయి. దీనికి అవసరమైన అనుమతులను కూడా నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ మంజూరు చేసింది. ఏప్రిల్ 1 నుంచి అత్యవసర మెడిసిన్స్‌పై కనీసం 10.7 శాతం అధిక ధరలను కొనుగోలుదారులను చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్లను నివారించడం, చర్మవ్యాధుల కోసం వాడే మందులు, గుండె జబ్బులు, అనీమియా, హై బీపీ లాంటి సమస్యలకు ఉపయోగించే మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి. అన్నిటి కంటే షాకింగ్ విషయం ఏంటంటే.. మనం ఏచిన్న నొప్పికైనా, జ్వరానికైనా వెంటనే వేసుకునే ‘పారాసెటిమాల్’ ధరలు కూడా పెరగనున్నాయి. కరోనా కాలంలో దేశంలో అత్యధికంగా వాడింది పారాసెటిమాల్.. డోలో-650 ట్యాబ్లెట్లనే. అయితే ప్రస్తుతం వీటి ధరలు కూడా పెరగనున్నాయి. వీటితో పాటు కరోనా చికిత్సలో ఎక్కువగా వినియోగించిని యాంటీ బయాటిక్ అజిత్రోమైసిన్ ధరలు కూడా పెరగనున్నాయి. అటు విటమిన్ ట్యాబ్లెట్లకు కూడా ధరలు పెరగనున్నాయి.
ఔషధాల ధరలు జంప్
RELATED ARTICLES