సిఎంకు చాడ వెంకట్‌రెడ్డి లేఖ
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న మెడికల్ సిబ్బంది సేవలను గుర్తించి ఒక నెల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యద ర్శి చాడ వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని వల్ల మరింత మెరుగైన సేవలను అందించడానికి వారిని ప్రోత్సహించినట్లవుతుందని ఆయనన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్‌కు,శానిటైజేషన్, పేషెంట్‌కేర్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా నెల జీతం ఇన్సెంటవ్ ప్రకటించాలని కోరారు. మున్సిపల్ కార్మికులు, మురికిలో పనిచేస్తున్నారని, మెడికల్ సిబ్బంది సేవలు మరవలేనివన్నారు. ప్రాణాలు ఫణంగాపెట్టి రాత్రి, పగలు అనకుండా పనిచేస్తున్నారని పనిచేస్తున్నారని చెప్పి వారిఆత్మ గౌరవాన్నిపెంచారని, వారికి పూర్తిస్తాయి వేతనాలిచ్చిప్రోత్సహించడాన్ని ఆయన స్వాగతించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న వేలాది నర్సింగ్, శానిటేషన్, పేషంట్ కేర్ సిబ్బందికి అతి తక్కువ వేత నం చెల్లిస్తున్నారని, అయితే ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 31 ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి పదిశాతం ప్రోత్సాహం ప్రకటిచారని గుర్తు చేశా రు. దీనిప్రకారం ఔట్ సోర్సింగ్ శానిటేషన్, పేషంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు పదివేల లోపు జీతం మాత్రమే ఉందని, వీరి జీతం ప్రకారం పది శా తం అంటే వెయ్యి లోపే వీరికి ప్రోత్సాహం క్రింద వస్తుందని గుర్తు చేశారు. వీరు ప్రాణాలొడ్డి 24 గంటల పాటు కరోనా వైరస్ సోకిన పేషంట్లకు అం దిస్తున్న సేవలు మరలేనివన్నారు. ఔట్ సోర్సింగ్ నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి రూ.17,500 జీతం వస్తుందని పది శాతం ప్రకారం వారికి రూ.1750 ఇన్సెంటివ్ మాత్రమే వస్తుందన్నారు. మున్సిపల్ కార్మికులకు రూ. 7,500 గిఫ్టు ప్రకటించారని, వారికి ఇచ్చినట్లుగానే రాత్రింబవళ్ళు పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ మెడికల్ సిబ్బ ందికి గిఫ్టు వర్తింపచేయాలని చాడ వెంకట్‌రెడ్డి