టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సెరెనా
న్యూయార్క్: ప్రపంచ టెన్నిస్‌లో ఓ శకానికి తెరపడింది. సెరెనా విలియమ్స్ తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఇక్కడ జరుగుతున్న యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో అజ్లా టొమ్జానొవిచ్తో తలపడి, 75, 67, 61 తేడాతో పరాజయాన్ని చవిచూసిన సెరెనా, అంతకు ముందు నిర్ణయించుకున్న విధంగానే రిటైర్మెంట్ ప్రకటించింది. టెన్నిస్‌లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తన సోదరి వీనస్ విలియమ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆమె లేనిదే తాను లేనని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల సహకారం తన కెరీర్‌కు దోహదం చేసిందని చెప్పింది. కెరీర్లో 24 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో మార్గరెట్ కోర్ట్ నెలకొల్పిన ఆల్‌టైమ్ రికార్డును మాత్రం సమం చేయలేకపోయింది. వేలాది మంది అభిమానుల సమక్షంలో, స్వదేశంలో జరుగుతున్న ఈ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ యుఎస్ ఓపెన్‌లో ఆమె టైటిల్ సాధిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, ఆమె పోరాటం మూడో రౌండ్‌తోనే ముగిసింది. వింబుల్డన్ ఫైనలిస్టు బెరెటినీతో సుమారు మూడున్నర గంటలపాటు పోరాడిన సెరెనా ఓటమి అనంతరం వీడ్కోలు పలుకుతున్నప్పుడు బిల్జీ జీన్ కింగ్ స్టేడియంలో ప్రేక్షకులంతా లేచి నిలబడి ఆమెకు జేజేలు పలికారు. మహిళా టెన్నిస్ దిగ్గజాల్లో ఒకరిగా పేరు సంపాదించిన సెరెనా 1981 సెప్టెంబరు 26 జన్మించింది. ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. 1995 సెప్టెంబరు 24న కెరీర్ ప్రారంభించింది. 572 విజయాలు, 110 పరాజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 48 డబ్ల్యుటిఎ టైటిళ్లు అందుకుంది. 43,179,272 డాలర్ల ప్రైజ్‌మనీ సంపాదించింది. మహిళా టెన్నిస్‌లో ఇదే అత్యధిక మొత్తం. పురుషుల విభాగాన్ని కూడా కలిపితే, ప్రైజ్‌మనీలో సెరెనాది రెండో స్థానం. ఆస్ట్రేలియా ఓపెన్‌ను 7 సార్లు (2003, 2005, 2007, 2009, 2010, 2015, 2017), ఫ్రెంచ్ ఓపెన్‌ను 3 సా ర్లు (2002, 2003, 2015), వింబుల్డన్‌ను 7 సార్లు (2002, 2003, 2009. 2010, 2012, 2015, 2016), యుఎస్ ఓపెన్‌ను 6 సార్లు (1999, 2002, 2009, 2012, 2013, 2017) చొప్పున మొత్తం 23 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించింది. ఇలావుంటే వెటరన్ ఆటగాడు ఆండీ ముర్రే కూడా యుఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో మాటియో బెరెటినీతో తలపడి, 4 4 7 3 పరాజయాన్ని ఎదుర్కొన్నాడ
ఓ శకానికి తెర
RELATED ARTICLES