ముగిసిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్
పూణే: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలు ఆదివారం ముగిసాయి. ఆతిథ్య మహారాష్ట్ర జట్టు అత్యధిక మెడల్స్ గెలుచుకొని ఓవరాల్ చాంప్‌గా నిలిచింది. ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన ఈ ఖేలో ఇండియా యూత్ పోటీలకు మంచి ఆధారణ లభించింది. ఈ పోటీల్లో యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనలతో సత్తా చాటారు. అత్యధిక పతకాలు గెలుచుకున్న మహారాష్ట్ర జట్టు ఓవరాల్ చాంపియన్‌గా అవతరించింది. మహారాష్ట్ర జట్టు 85 స్వర్ణాలు, 62 రజతాలు, 81 కాంస్యలతో మొత్తం (228) పతకాలు గెలుచుకొని తొలి స్థానంలో నిలిచింది. 178 పతకాలతో హర్యాన జట్టు రెండో స్థానం దక్కించుకుంది. హర్యన 62 స్వర్ణాలు, 56 రజతాలు, 60 కాంస్యా పతకాలను సొంతం చేసుకుంది. 48 పసిడిలు, 37 రజతాలు, 51 కాంస్యలతో కలిపి మొత్తం 136 పతకాలు సొంతం చేసుకున్న ఢిల్లీ జట్టు మూడో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (30 స్వర్ణాలు), తమిళ్నాడు (27 స్వర్ణాలతో) టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నాయి.
ఓవరాల్ చాంప్ మహారాష్ట్ర
RELATED ARTICLES