ఐసిసి ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి ఓటమి
ప్రస్తుతం 360 పాయింట్లతో మొదటి స్థానంలో టీమిండియా
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా.. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ 183 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో.. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. దీంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో దూసుకుపోతున్న టీమిండియా జోరుకి న్యూజిలా్‌ండ ఆడ్డుకట్ట వేసింది.
ఏడు టెస్టుల్లోనూ భారత్ జయకేతనం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గత ఏడాది ఆగస్టులో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఆడిన ఏడు టెస్టుల్లోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. సోమవారం ముగిసిన తొలి టెస్టులో కివీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అయినా కూడా పాయింట్ల పట్టికలో భారత్ తన నెం.1 స్థానాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం 360 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ప్రతి సిరీస్‌కి 120 పాయింట్లని ఐసీసీ కేటాయించిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌లో ఒక్కో మ్యాచ్ గెలిచిన జట్టుకు 60 పాయింట్ల చొప్పున కేటాయిస్తుంటే, అదే ఐదు టెస్టుల సిరీస్‌లో మ్యాచ్ గెలిచిన జట్టుకు 24 పాయింట్ల చొప్పున ఇస్తున్నారు. అంటే టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే ఒక సిరీస్‌ను ఒక జట్టు క్లీన్‌స్వీప్ చేస్తే గరిష్టంగా 120 పాయింట్లు సాధిస్తుంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో..
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 7 మ్యాచులు గెలిచినా భారత్ 360 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొలి టెస్టులో టీమిండియాని ఓడించిన కివీస్ 120 పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా (296 పాయింట్లు), ఇంగ్లాండ (146), పాకిస్థాన్ (140) జట్లు వరుసగా టాప్-4లో ఉన్నాయి. 2019 ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమయింది. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ న్యూజిలా్‌ండ జట్లు ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. అన్ని టెస్టుల అనంతరం టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్ నెలలో ఫైనల్ జరగనుంది.
ఓడినా టాప్‌లోనే భారత్
RELATED ARTICLES