అదొక గొప్ప క్షణంగా భావించాలి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం
న్యూఢిలీ: ఓటు హక్కు అన్ని హక్కుల్లోకెల్లా గొప్పదని, అదొక పవిత్ర కార్యంగా ప్రతిఒక్కరూ పరిగణించాలని రాష్ట్రపతి రా మ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు హ క్కును ఎన్నిసార్లు ఉపయోగించుకున్నా, ఓటు వేసిన ప్రతిసారీ శతాబ్దంలో ఒకసారే వచ్చే గొప్ప క్షణంగా భావించాలని కోరారు. భారత 70వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొ ని రాష్ట్రపతి జాతినుద్దేశించి శుక్రవారం ప్రసంగించారు. 21వ శతాబ్దంలో దేశ స్వరూపానికి ఈ ఓటే ఒక మార్గసూచీ కావాలన్నారు. ఎన్నికలనేవి కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, తెలివితేటలకు, ఒక గొప్ప కార్యాచరణకు సమష్టి పిలుపు అని అన్నారు. మన ప్రజాస్వామ్య ఆలోచనలు, ఆదర్శవాదం వచ్చే 17వ లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కావాలన్నారు. వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి… ఈ మూడు అంశాల ప్రాతిపదిక గా భారత ప్రభుత్వం త్రిముఖవ్యూహంతో పరివేష్టిత, బహుళత్వ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతున్నదని చెప్పారు. “ఈ దేశం ప్రతి ఒక్కరిది, మనందరిది. దేశంలో వున్న ప్రతి వర్గానిదీ, ప్రతి కులానిదీ, ప్రతి మతానిదీ, అలాగే ప్ర తి పౌరునిదీ. అందుకే భారత బహుళత్వం మనందరికీ గొప్ప బలం. ప్రపంచానికి ఇదొక గొప్ప ఉదాహర ణ. భారత తరహా నమూనా మనకు ఇంకెక్కడా కన్పించదు. అదే మన ప్రత్యేకత. దాన్ని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని పరిరక్షించుకోవాలి. వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి అనేవి వేర్వేరుగా అగుపించినప్పటికీ, వాటన్నింటి సమ్మిళితమే మన దేశమని గుర్తించాలి. ప్రస్తుతం ఈ మూడింటి ప్రాతిపదికగానే మనదేశ దిశ, దశ సాగుతోంది. జూన్ మాసానికి ముందే ప్రస్తుత లోకసభ గడువు ముగుస్తున్నది. ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నిక లు దేశ కొత్త భవిష్యత్‌ను నిర్దేశించాలి. 21వ శతాబ్దంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వారంతా దేశ భవిష్యత్‌కు మం చి మార్గదర్శకులు కావాలి. అలాగే ఓటేసే ప్రతి ఒక్కరూ శతాబ్దంలో ఒకేసారి వచ్చే క్షణంగానే దాన్ని పరిగణించాలి” అని రాష్ట్రపతి అన్నారు.
ఓటు..ఓ పవిత్ర కార్యం!
RELATED ARTICLES