మహిళా ఓటర్లు 1.48 కోట్లు
పురుష ఓటర్లు 1.50కోట్లు
రాష్ట్రంలో కొత్తగా నమోదైన ఓటర్లు 1.44లక్షలు
ప్రజాపక్షం / హైదరాబాద్ ; రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల తుదిజాబితాను ప్రచురించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ జాబితా మేరకు 119 నియోజకవర్గాల్లో 2,99,32,943 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,48,89,410 మంది, పురుష ఓటర్లు 1,50,41,943 మంది ఉన్నారు. వీరిలో కొత్తగా నమోదైన ఓటర్లు 1,44,855 ఉన్నారు. థర్డ్ జెండర్లు 1590 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34707 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3,09,300 ఓటర్లు ఉండగా అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60,780మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల వివరాలు జిల్లాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
ఓటర్లు 2.99 కోట్లు
RELATED ARTICLES