రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 88.26% పోలింగ్
తొలి విడత కంటే పెరిగిన ఓటింగ్
ఫలితాల్లో కొనసాగిన అధికారపార్టీ ఆధిపత్యం
యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 93.71 శాతం పోలింగ్
అత్యల్పంగా జనగాం జిల్లాలో 80.23 శాతం
హైదరాబాద్ : పల్లె నేలపై ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. శుక్రవారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పల్లె వాసులు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి విడతలో 85.76 పోలింగ్ శాతం నమోదు కాగా, రెండో విడతలో 88.26 శాతం నమోదయింది. తొలి విడతలో హవా కొనసాగించిన అధికార టిఆర్ఎస్ రెండో విడతలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. విపక్షాలు సైతం తమ ఉనికిని చాటుకున్నాయి. రెండో విడతలో మొత్తం 4116 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వీటిలో 573 ఏకగ్రీవం కావడం, మరో పది పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 3529 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. తొలి విడతలో అక్కడక్కడా జరిగిన పొరపాట్లను అధికారులు సరిదిద్దుకోవడంతో రెండో విడతలో అంతా సవ్యం గా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ముగించారు. రెండో విడతలో మొత్తం 42,79,277 మంది ఓటర్లు ఉండగా 37,76,797 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటరు చైతన్యం వెల్లివిరిసింది
RELATED ARTICLES