బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్
హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఓడిపోతున్నదనే భయంతో కెసిఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని, బిజెపిపై కువిమర్శకులకు దిగుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం, ప్రధాని జాగీరా అని మాట్లాడడం ద్వారా కెసిఆర్ తన అపరిపక్వతను, అహాంకారాన్ని బయటపెట్టుకున్నారన్నారు. టిఆర్‌ఎస్ ఓడిపోతామన్న భయంతో పెద్దెత్తున నోట్ల కట్టలతో, మద్యంతో ఓటర్లను ప్రభావింత చేసేందుకుంటున్నారని, ఓటర్లను ప్రభావితం చేయకుండా రెండు రోజుల పాటు డబ్బు పంపిణీని ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలని ఆయన కోరారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్‌రావుతో కలిసి డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు. ఇప్పటివరకు ప్రచార, ప్రసార సాధనాలు, కొంత మంది రాజకీయ పండితులు బిజెపి పోటీలో ఉండదని దుష్ప్రచారం చేశారని, ఈ ఊహాగాలన్నీ తప్పు అని, ప్రజులు పటాపంచలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రాతిపదిక అయిన నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలను పరిష్కరించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. బిజెపి మ్యానీఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటే నిశ్చింతగా బిజెపికి ఓటు వేయవచ్చని ఆయన అన్నారు.
ఓటమి భయంతోనే మాపై విమర్శలు
RELATED ARTICLES