వార్మప్‌లో గెలిచిన విండీస్‌కు సూపర్‌లో చుక్కలు
టి20 వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం
బ్రిస్బెన్: టి20 ప్రపంచకప్ ముంగిట భారత మహిళలు అద్భుత విజయాన్నందుకున్నారు. వెస్టిండీస్‌తో మంగళవారం ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన సన్నాహక మ్యాచ్‌లో 2 పరుగులతో గెలుపొందారు. ప్రత్యర్థి విజయానికి చివరి 3 బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. భారత బౌలర్ పూనమ్ యాదవ్ ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీసి అద్భుత విజయాన్నందించింది. ఫలితంగా 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న భారత్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసింది. దీప్తి శర్మ(21), శిఖా పాండే(24 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన(4) తీవ్రంగా నిరాశపరచగా.. షెఫాలి వర్మ(12), జెమీమా(0), కెప్టెన్ హర్మన్ (11), వేద కృష్ణమూర్తి (5) దారుణంగా విఫలమయ్యారు. ప్రత్యర్ధి బౌలర్లలో షమీలా కన్నెల్, అనిస మహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. హెన్రీ, ఫ్లెచర్, స్టెఫానీ, అలియా అల్లెన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో లీయాన్ కిర్బీ (42), హేలే మాథ్యూస్ (25) పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో వెస్టిండీస్ విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా.. బంతినందుకున్న పూనమ్ తొలి మూడు బంతుల్లో ఏడు పరుగులిచ్చింది. దీంతో విండీస్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ పూనమ్ అద్భుత బౌలింగ్‌తో తొలుత మాథ్యుస్, చివర్లో హెన్రీ(17) ఔట్ చేసి భారత్‌కు విజయాన్నందించింది. భారత బౌలర్లలో పూనమ్ మూడు వికెట్లు తీయగా.. శిఖా పాండే, దీప్తీ శర్మ, హర్మన్ ప్రీత్ తలో వికెట్ దక్కించుకున్నారు. పాకిస్థాన్‌తో జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ రద్దవ్వగా.. తాజా మ్యాచ్‌లో హర్మన్ సేనకు మంచి ప్రాక్టీస్ లభించింది.ఇక ఈ నెల 21న ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో మెగాటోర్నీకి తెరలేవనుంది.
ఓటమికి ప్రతీకారం
RELATED ARTICLES