ఎన్నికల హామీలను అమలు చేయాలి
రోజుల్లో రైతు రుణాలను మాఫీ చేయాలి
శివరాజ్ సింగ్ చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో బిజెపి ఓటమికి పూర్తి బా ధ్యత వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఎంపిలో బిజెపికి పూర్తి మెజార్టీ రానందున బుధవారం శివరాజ్ సింగ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను కలిసి తన రాజీనామా లేఖ ను అందజేశారు. అనంతరం రాజ్‌భవన్ వద్ద విలేకర్లతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో బిజెపి అధికారం కోల్పోవడానికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు బిజెపి గెలుపు కో సం చాలా కష్టపడ్డారని, ప్రజలు కూడా తమ పార్టీ పై ప్రేమాభిమానాలను పంచారని పేర్కొన్నారు. అయితే మ్యాజిగ్ ఫిగర్‌కు అవసరమైన సీట్లను సాధించడంలో తాము విఫలం చెందామన్నారు.
కాంగ్రెస్ తాను ఇచ్చిన హామీలను నేరవేర్చాలి
ఇక కాంగ్రెస్ తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చాలని చౌహాన్ డిమాండ్ చేశా రు. ఎంపిలో అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రైతు రుణాలను మాఫి చేస్తామని ఎఐసిసి అధ్యక్షు డు రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుతం వారు అధికారం చేపట్టబోతున్నారు. కావున కాంగ్రెస్ స ర్కారు కొలువుదీరిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేయాలని పేర్కొన్నారు. రైతు రుణాలను మాఫీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం నిర్ల క్ష్యం వహించిన ఊరుకునేది లేదని స్పష్టం చేశా రు. తమకు అధికారం దక్కనందుకు బాధపడడం లేదని ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తామని పేర్కొన్నారు. అలాగే బిజెపి త్వరలో నే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుందని.. ఇం దుకోసం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.