మహిళల బాక్సింగ్‌లో సెమీస్ చేరిన లవ్లీనా
టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. మీరాబాయ్ చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహైన్ కనీసం కాంస్య పతకాన్ని కైవసం చేసుకోనుంది. శుక్రవారం జరిగిన మహిళల 69 కిలోల వెల్టర్ వెయిట్ విభాగం క్వార్టర్ ఫైనల్‌లో ఆమె చైనీస్‌తైపీ బాక్సర్ చెన్ నియెన్ చిన్‌పై 4- తేడాతో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిబంధనలను అనుసరించి, ఒలింపిక్స్ వంటి మే జర్ టోర్నీల్లో సెమీస్‌లో ఓడిన వారికి కాంస్య పతకాన్ని అందచేస్తారు. ఈ కారణంగా సెమీస్‌లో చైనాకు చెందిన తాయ్ జు ఇంగ్ చేతిలో ఓడినా కాంస్యాన్ని అందుకుంటుంది. గెలిస్తే, ఫైనల్ చేరి, కనీసం రజత పతకాన్ని తన ఖాతా లో వేసుకుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లవ్లీనా టైటిల్‌ను అందుకున్నా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మీద మన దేశం తరఫున విజేందర్ సింగ్, మేరీ కోమ్ తర్వాత ఒలింపిక్స్ బాక్సింగ్‌లో పతకాన్ని సాధించిన ఘనతను లవ్లీనా దక్కించుకోనుంది. కాగా, మహిళల లైట్‌వెయిట్ విభాగంలో బాత్ సిమ్రన్‌జిత్ కౌర్ తన ప్రత్యర్థి థా సీసొండీ సుడాపొర్న్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, నిష్క్రమించింది.
తిరుగులేని పివి సింధు
బాడ్మింటన్ సూపర్ స్టార్ పివి సింధు టోక్యో ఒలింపిక్స్‌లో జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. శుక్రవారం నాటి మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. తద్వారా భారత్‌కు మరో పతకంపై ఆశలు పెంచింది. మ్యాచ్ ఆరంభం నుంచే యమగూచిపై విరుచుకుపడిన సింధు ఆతర్వాత ప్రత్యర్థి నుంచి ఎదురైన ఎదురుదాడిని తట్టుకొని నిలబడింది. ఆ సెట్‌ను 21 ఆధిక్యంతో తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌లో యమగూచి చివరి క్షణం వరకూ పోరాటాన్ని కొనసాగించింది. సొంతగడ్డపై ఆడుతున్న ఆమె సింధును ఓడించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అయితే, ఆమె దాడులను సమర్థంగా తప్పికొట్టిన సింధు రెండోసెట్‌ను 22- తేడాతో సొంతం చేసుకొని సెమీస్ చేరింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని అందుకున్న సింధు ఈసారి స్వర్ణ పతకంపై దృష్టి పెట్టింది. ఆమె విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గుర్జాంత్ సింగ్ ‘డబుల్’.. హాకీలో క్వార్టర్స్‌కు భారత్
పురుషుల హాకీలో భారత్ క్వార్టర్స్ ఫైనల్ చేరింది. శుక్రవారం జపాన్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ని 5 తేడాతో గెల్చుకొని, తన గ్రూప్‌లో ఆస్ట్రేలియా తర్వాత, రెండో స్థానంలో నిలిచి, క్వార్టర్స్‌కు అర్హత సంపాదించింది. గుర్‌జాంత్ సింగ్ రెండు గోల్స్ చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రథమార్థం ముగిసే వరకూ నువ్వా? నేనా? అన్న చందంగా సాగిన మ్యాచ్‌పై భారత్ క్రమంగా పట్టు సంపాదించింది. మ్యాచ్ 13వ నిమిషంలో తొలి గోల్ చేసిన గుర్జాంత్ చివరిలో మరో గోల్ సాధించాడు. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, శంషేర్ సింగ్, నీలకంఠ శర్మ తలా ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున కొటో వతనబె రెండు గోల్స్ చేయగా, చివరి క్షణాల్లోకుజుమా మురాతా ఒక గోల్ సాధించాడు.
ఒలింపిక్స్‌లో.. మరో పతకం ఖాయం
RELATED ARTICLES