రద్దయ్యే అవకాశం!
టోక్యో : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సెగ ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌కు కూడా తగిలింది. మరో ఆరునెలల్లో ప్రారంభంకానున్న ఈ మెగాఈవెంట్ నిర్వహణపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ కరోనా వైరస్ ఇప్పుడు టోక్యో నిర్వాహకులను బెంబేలెత్తిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతూ మనుషుల పాలిట మహమ్మారిగా మారిన ఈ వైరస్ టోక్యో ఒలింపిక్స్‌తో మరింతగా విస్తరించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. చైనాలో మొదలైన ఈ వైరస్ వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది.చైనాలో కరోనావైరస్ బారినపడ్డ వారి సంఖ్య 24,300కు చేరుకుంది. చనిపోయినవారి సంఖ్య 490 దాటింది. మొత్తంగా ఈ మహమ్మారి 27 దేశాలకు విస్తరించింది. ఒలింపిక్స్ జరిగే జపాన్‌లో ఇప్పటికే 10 కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మెగా ఈవెంట్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తిపట్ల టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాణాంతక వైరస్ మెగాఈవెంట్ నిర్వహణకు అడ్డు తగులుతుందేమోనని భయంగా ఉందని జపనీస్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ తొషిరో ముటో తెలిపాడు. వీలైనంత తర్వగా ఈ వైరస్ నిర్మూలించబడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక జపాన్ ప్రధానితో పాటు ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఈ వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అథ్లెట్లు ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నామని అథ్లెట్స్ విలేజ్ మేయర్ సాబురో కవాబుచి తెలిపాడు. మరో వైపు టోక్యో ఒలింపిక్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) స్పష్టం చేసింది. కరోవైరస్ ప్రభావం ఒలింపిక్స్‌పై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఐఓసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒలింపిక్స్ సందర్భంగా ఈ ప్రాణాంతక వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో, వైద్య నిపుణుల సాయం కోరినట్లు ఆ అధికారి స్పష్టం చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా… సురిక్షితంగా మెగా ఈవెంట్‌ను నిర్వహించడం తమ ప్రణాళికల్లో ఒక భాగమన్నారు. అలాగే తమ ప్రణాళికల ప్రకారం టోక్యో ఒలింపిక్స్ ఏర్పాట్లు జరుగతాయన్నారు. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్‌తో చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అతలాకుతలమైంది. ఇక ఆ దేశంలో జరిగాల్సిన స్పోరట్స్ ఈవెంట్స్ అన్నీ రద్దయ్యాయి. కొన్ని ఇతర దేశాలకు షిప్ట్ అవ్వగా.. మరికొన్ని వాయిదాపడ్డాయి.
ఒలింపిక్స్‌పై కరోనా పంజా!
RELATED ARTICLES