HomeNewsఒలింపిక్స్‌కు ఘన చరిత్ర

ఒలింపిక్స్‌కు ఘన చరిత్ర

పారిస్‌ సమ్మర్‌ ఒలింపిక్స్‌ ముగిశాయి. 117 మందితో కూడిన భారత క్రీడాకారుల బృందం ఒక రజతం, ఐదు కాంస్యాలతో మొత్తం ఆరు పతకాలు కైవసం చేసుకొని 71వ స్థానంతో సంతృప్తి చెందింది. విశ్వ క్రీడా వేదికగా పిలిచే ఒలింపిక్స్‌కు ఘన చరిత్రే ఉంది. క్రీస్తు పూర్వం 776లో తొలి ఒలింపిక్స్‌ గ్రీస్‌లోని ఒలింపియా వేదికగా జరిగాయని అంటారు. ఈ క్రీడలు క్రీస్తు పూర్వం ఎనిమిది నుంచి నాలుగో శతాబ్దం మధ్య ప్రారంభమై ఉండవచ్చన్న వాదన కూడా వినిపిస్తుంది. ఎప్పుడు మొదలయ్యాయనే విషయాన్ని పక్కకుపెడితే, ఒలింపియా కేంద్రంగా ఒలింపిక్స్‌ జరిగేవన్నది అందరూ అం గీకరించే విషయం. అప్పట్లో ఆకాశం, వాతావరణ దేవత ‘జూస్‌’ను ఆరాధిం చే క్రమంలో ఈ క్రీడలను నిర్వహించేవారు. అథ్లెటిక్స్‌, జావెలిన్‌త్రో, డిస్కస్‌ త్రో, లాంగ్‌ జంప్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌ వంటి అంశాల్లో పోటీలు ఉండేవి. కా లక్రమంలో ఒలింపిక్‌ క్రీడలు కనుమరుగయ్యాయి. ఆధునిక ఒలింపిక్స్‌కు పి యరీ డి కుయెర్టన్‌ శ్రీకారం చుట్టాడు. అతని విస్త్రృతమైన ప్రయత్నాలతో, మొదటిసారి ఆధునిక ఒలింపిక్స్‌ 1896లో ఏథెన్స్‌ వేదికగా మొదలయ్యా యి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ పోటీలను వివిధ క్రీడా విభాగాల్లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు ప్రత్యామ్నాయంగా పేర్కొంటారు. సుమారు శతాబ్దకాలం సమ్మర్‌, వింటర్‌ ఒలింపిక్స్‌ ఒకే ఏడాది జరిగేవి. కానీ, 1994లో వింటర్‌ ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ను మార్చారు. సమ్మర్‌ ఒలింపిక్స్‌ ముగిసిన రెండు సంవత్సరాల తర్వాత వింటర్‌ ఒలింపిక్స్‌ జరుగుతాయి. అంటే, నాలుగేళ్ల కాలంలో ప్రతి రెండేళ్లకు ఒలింపిక్స్‌ ఉండేలా అంతర్జాతీయ ఒలింపిక్‌ మండలి (ఐఒసి) షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments