విజయ్ ప్రషాద్
పాలస్తీనియన్ల కలలు కనే హక్కును ఎవరూ కొల్లగొట్టలేరు. గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతున్నదని నమ్ముతున్నట్టు అం తర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) కూడా ఇటీవల స్పష్టం చేసింది. ఇలాంటి అరాచకాలను తక్షణమే నిలిపివేయాల్సిందిగా ఆదేశా లు జారీ చేయాలని ఇజ్రాయెల్‌కు సూచించింది. 1948లో ఐక్యరాజ్య సమితి (యుఎ న్) చేసిన తీర్మానానికి అనుగుణంగా నడుచుకోవాలని కూడా స్పష్టం చేసింది. ఉక్రేన్‌పై చర్యకు దిగిన రష్యాకు స్పష్టం చేసిన విధం గా, గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ అమ లు చేయాలని ఇజ్రాయెల్‌కు ఐసిజె స్పష్టమై న పిలుపును ఇవ్వలేదు. కనీసం కోర్టు ఆర్డర్‌ను చదవలేదు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌కు సూచిస్తూ, ఈ దిశగా తీసుకున్న చర్యలను వివరించడానికి నెల రోజుల గడువు కూడా ఇచ్చింది. ఐసిజె సూచనలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. అ యితే, ఆ దేశంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. ఐసిజె సూచనలను అమలు చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ను ఆదేశించాలని కోరుతూ అల్జీరియా ఇప్పటికే యుఎన్ భద్రతా మండలిని ఆశ్రయించింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇ జ్రాయెల్ కాల్పుల విరమణను పాటించేలా చూడాలన్న ఇండోనేషియా, స్లొవేనియా పిటిషన్లపై ఐసిజె ఈనెల 19 నుంచి విచారిస్తుంది. యుఎన్ సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ) తీర్మానాలను కూడా ఈ దేశాలు కోరుతున్నాయి. మరోవైపు చిలీ, మెక్సికో దేశాలు గాజాలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న హింస, దౌర్జన్యం వంటి నేరాలపై దర్యాప్తు చేయాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)ని కోరాయి. కాగా, సహజంగానే ఐసిజె ఉత్తర్వులను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఆ దేశ జాతీయ భద్రతా మంత్రి ఇ టామర్ బెన్ విర్ ఐసిజెను యూదుల వ్యతిరేక సంస్థగా అభివర్ణించాడు. యూరోపియ యూదులు, రోమానీలు, స్వలింగ సంపర్కులు, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నాజీ జర్మన్ పాలకులు, మద్దతుదారులు జరిపిన ‘హోలోకాస్ట్’ మారణకాండపై ఐసిజె మౌనం ఉందని ఆయన విమర్శించారు. నిజానికి ఆ ఘటన 1941 చివరిలో ప్రారంభమై, 1945 మే మాసంలో ముగిసిన అంశాన్ని, ఆ తర్వాత నెల రోజులకు ప్రారంభమైన ఐసిజెకు ఆపాదించడం విచిత్రం. ఒకదాని ఒకటి సంబంధం లేని వాదనలు వినిపి స్తూ, ఐసిజెతోపాటు అంతర్జాతీయ సమా జం చేస్తున్న డిమాండ్లను, సూచనలను కూ డా ఇజ్రాయెల్ కాలరాస్తున్నది. గాజాలో పా లస్తీనియన్లపై విచక్షణారహితంగా బాంబు దాడులకు తెగబడుతున్నది. వేలాది మందిని పొట్టనబెట్టుకుంటున్నది. అక్కడ అన్ని కొనసాగుతున్న దాడులకు, మారణకాండకు తక్షణమే స్వస్తి పలకాలని ఐసిజెలో న్యాయమూర్తిగా ఉన్న భారత దేశానికి చెందిన దల్వీర్ భండారీ స్పష్టం చేశారు. కానీ, ఇజ్రాయెల్ తన దమననీతిని విడిచిపెట్టడం లేదు. గాజా స్ట్రిప్‌లో శాంతి నెలకొనే దిశగా ఏ ఒక్క చర్యను కూడా చేపట్టడం లేదు. ఇప్పటి కే ఇజ్రాయెల్ దాడుల్లో ఎంతో మంది పా లస్తీనా చిత్రకారులు, కవులు, రచయితలు, శి ల్పులు ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనా ను ప్రపంచ చిత్రపటం నుంచి తొలగించడ మే ఇజ్రాయెల్ లక్ష్యంగా ఎంచుకున్నట్టు కనిపిస్తున్నది. అయితే, ఇలాంటి దాడులు, మారణహోమాలు పాలస్తీనాకు కొత్తేమీ కా దు. గత 76 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ ఎ న్నో పర్యాయాలు దాడులు జరిపింది. కానీ, పాలస్తీనా ఎన్నడూ తన సాంస్కృతి వైభవా న్ని కోల్పోలేదు. గాజా నగరం లేదా జెనిన్ వీధుల్లో పర్యటిస్తే, లెక్కలేనన్ని చిత్రలేఖన గ్యాలరీలు, స్టూడియోలు దర్శనమిస్తాయి. పాలస్తీనా ప్రజల కలలు గనే హక్కును పదిలపరుస్తుంటాయి. 1974 చివరలో, దక్షిణాఫ్రికా మిలిటెంట్, కళాకారుడు బారీ విన్సెం ట్ ఫెయిన్బర్గ్ ఆఫ్రో-ఆసియన్ జర్నల్ ‘లోటస్’ ఒక కథనాన్ని ప్రచురించాడు. పాలస్తీనాకు చెందిన ఓ యువ రచయితతో తాను జరిపిన సంభాషణను అందులో ప్రస్తావించాడు. ‘పాలస్తీనా కవుల నుంచి అసాధారణ రీతిలో, పెద్ద సంఖ్యలో కవితలు ఎందుకు వ చ్చాయి?’ అన్న ఫెయిన్బర్గ్ ప్రశ్నకు ఆ యు వ కవి ఇచ్చిన సమాధానం ఎంతో గొప్పగా ఉంటుంది. ‘నా ప్రజలు ఎన్నడూ నిరాకరించని ఏకైక విషయం కలలు కనే హక్కు. దానిని ఎవరూ మా నుంచి వేరు చేయలేరు’ అని అతను ఇచ్చిన సమాధానం బెయిన్బర్గ్ను ఆలోచనల్లో పడేసింది. ఆ యువకవి నిజమే చెప్పాడు. గాజా స్ట్రిప్‌లో శాంతి నెలకొంటుందని పాలస్తీనా ప్రజలు కలలు కంటున్నారు. దాడులు, హింస, అణచివేత, రక్తపాతం, బాంబుల మోతలు, శవాల గు లేని పాలస్తీనా రావాలని కలలు కంటున్నారు. 24 ఏళ్ల యువ చిత్రకారిణి మలాక్ మత్తర్కు కూడా ఎన్నో కలలు… భవిష్యత్తు ఊహిస్తూ, కలలు కనడం ఆపడానికి ని రాకరించిన ఈ కళాకారిణి, చిన్నతనం నుం చే ఇజ్రాయెల్ దమనకాండను చూసిం 2014లో గాజాలో ఇజ్రాయెల్ ‘ఆపరేష ప్రొటెక్టివ్ ఎడ్జ్’ని నిర్వహించింది. కేవలం రెండు నెలల సమయంలో కనీసం రెండు వే ల మంది పాలస్తీనా పౌరలను హతమార్చిం ది. అప్పుడు మత్తర్ వయసు కేవలం 14 సం వత్సరాలు. అయితే, పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ బాంబుదాడులు చేసి, వేలాది మంది మరణానికి కారణమైన వైనం ఆమె కు తెలుసు. ఇలాంటి ఆక్రమణల వల్ల మనసుకు తగిన గాయాన్ని మరచిపోవడానికి బొమ్మలు వేయడాన్ని మొదలు పెట్టమని మత్తర్కు ఆమె తల్లి సూచించింది. ఆమె తండ్రి అల్జోరా (ప్రస్తుతం అష్కెలో తల్లి గాజా స్ట్రిప్‌లోని గ్రామాల్లో ఒకటైన అల్షార్కీకి చెందిన వారు. వీరిద్దరూ శరణార్థులే. 1948, నవంబర్ 25న కొత్తగా ఏర్పడిన ఇజ్రాయెల్ ప్రనుత్వం ఆర్డర్ నంబర్ 40ని ఆమోదించింది. దాని ప్రకారం అల్జొరా, అల్బాటీ, అల్షార్కీ వంటి గ్రామాల నుంచి పాలస్తీనియన్లను బహిష్కరించే అధికారం సైన్యానికి ఇచ్చింది. ఆ తర్వాత చోటు చేసుకున్న మారణకాండ, హింస మత్తర్ తల్లిదండ్రులను జీవితాంతం వెంటాడాయి. కానీ, ఆమెకు వారు కలలుకనడాన్ని నేర్పా ఆశలను బతికించుకోవడానికి కడ వర ప్రయత్నించాల్సిన అవసరాన్ని బోధించారు. మత్తర్ ఒక గొప్ప ప్రపంచాన్ని ఊహించింది. బ్రష్‌ను తీసుకొని, ప్రకాశంతమైన రంగులతో తన కలలను చిత్రాల్లో బతికించుకుంది. ‘సుముద్’ (స్థిరత్వం)కు చి హ్నంగా ఆలివ్ చెట్టు ఆమె చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. యువతులు, మహిళలు, పిల్లలు, పావురాలు ఆమె కుంచె నుంచి ప్రా ణం పోసుకున్నాయి. ‘మహిళల తలలు తరచుగా ఒక పక్కకు ఒరిగి ఉంటాయి. నిటారు గా నిలబడితే వారు స్థిరంగా ఉన్నట్టు. కానీ, తల ఒకవైపు ఒంగి ఉండడం బలహీనతకు, ఛిద్రతమైన అనుభూతులకు నిదర్శ నం’ అంటుంది మత్తర్. అంతటి నిశితమైన దృష్టి, తీక్షణమైన ఆలోచనా శక్తి ఉన్నాయి కాబట్టే, ఆమె వేసే బొమ్మల్లో పాలస్తీనియన్ల జీవితా లు మనకు సాక్షాత్కరిస్తాయి. యుద్ధా లు, ని రంతర హింస, అత్యాచారాలు, మారణహోమాల కారణంగా అత్యంత భయానక జీవితాన్ని గడుపుతున్న తాము, కొన్ని సందర్భా ల్లో సహనాన్ని కోల్పోతామని, అలాంటి పరిస్థితుల్లో చిత్రలేఖనమే తనను సరికొత్త లోకాలకు తీసుకెళుతుందని అంటుంది మ త్తర్. ఆమె మాటల్లో నిజం ఉంది. ఆలోచన ల్లో అ ర్థం ఉంది. భావాల్లో విజ్ఞత ఉంది. అవే తిరి గి ఆమె పెయింటింగ్స్‌లో ప్రతిబింబిస్తా యి. ‘మారణహోమానికి సంబంధిన అనేక అం శాలను వర్ణించే భారీ పెయింటి్ంప పని చేస్తున్నాను‘ అని ఆమె రాసుకుంది. ఐదు మీటర్ల కాన్వాస్‌పై పాబ్లో పికాసో యొక్క ప్రసిద్ధ గ్వెర్నికా (1937)ని పోలి ఉండేలా ఒక కళాకృతిని సృష్టించింది. ‘పాలస్తీనా పికాసో’గా పేరు సంపాదించింది. ఈ కొత్త పెయింటింగ్ పాలస్తీనా ప్రజల హృదయ వి దారకా న్ని, దృఢత్వాన్ని ప్రతిబింబిస్తుంది. క లలు కనే పాలస్తీనియన్ల హక్కును చాటి చె ప్తుంది. ‘శిధిలమైన మసీదులు.. ఖననం చేయని మృతదేహాలు.. నగ్న ఖైదీలు.. చిన్న పిల్లల శ వాలు.. పేలుతున్న బాంబులు.. పారిపోతు న్న శరణార్థులు.. ఇదీ ప్రస్తుతం పాలస్తీనా ముఖ చిత్రం. నా చిత్రాలకు ప్రేరణ’ అని చెప్పే మత్తర్కు కలలుకనే హక్కుపై మ క్కువ ఎక్కువ. అందుకే లక్షలాది మంది పా లస్తీనియన్లకు ఆమె ప్రతినిధిగా కనిపిస్తుంది. పాలస్తీనా ఇప్పుడు భయం గుప్పిట్లో అల్లాడిపోతున్నది. గాజా స్ట్రిప్, వెస్ట్‌బ్యాంక్ ప్రాం తా ల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయి. మౌలి క సదుపాయాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలపైన కూడా ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్న నే దిక్కుతోచక విలవిల్లాడుతున్నా రు. మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. చిన్నారుల ఊచకొత కొనసాగుతున్నది. ‘హమాస్ ఉగ్రవాదుల ఏరివేత’ పేరుతో ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించి, నిరంతర దాడులు చేస్తున్నది. అంతర్జాతీయ సమాజం నుంచి సాయం అందకుండా అడ్డుకుంటూ, పైశాచిక ఆనం దం పొందుతున్నది. చెల్లాచెదురై, పిడికెడు తిండి, గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్న పా లస్తీనియన్లకు సాయం అందిస్తున్న యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్కింగ్ ఏజెన్సీ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) నిధుల్లో కోత పడడంలో అమెరికా వంటి దేశాలు ప్రధాన భూ మిక పోషించాయి. ఇజ్రాయెల్ దుర్మార్గమైన విధానాలకు మద్దతునిస్తున్నాయి. ఇప్పటికే మారణహోమంలో సమిధలుగా మారుతు న్న పాలస్తీనియన్ల జీవితాలను మరింత ప్ర మాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇన్ని ఒత్తిళ్లు, స మస్యల మధ్య కూడా పాలస్తీనియన్లు కలలుగనే హక్కును పదిలంగా దాచుకున్నారు. మ త్తర్ చిత్రాలు పాలస్తీనా ప్రజల గుండె చప్పుళ్లను దృశ్యరూపంలో వినిపిస్తున్నాయి. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణహోమా న్ని చూడడానికి నిరాకరించే వారి గుండెలోతుల్లోకి చొచ్చుకుపోయేలా ఆమె పెయింట్స్ కు విస్తృత ప్రచారం కావాలి. పా లస్తీనా స మస్యలు యావత్ ప్రపంచానికి తెలియాలి. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మ త్తర్ పెయింట్స్ ద్వారా పాలస్తీనా ప్రజల క లలుగనే హక్కును వారికి అందించేందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలి. ఇది ఒక ప్రాంత సమస్య కాదు… జాత్యహంకార.. సామ్రాజ్యవాద శక్తుల చేతిలో చిక్కుకొని అల్లాడుతున్న ప్రతి ఒక్కరి సమస్య.
(రచయిత ప్రముఖ జర్నలిస్టు,‘లెఫ్ట్ వర్డ్ బుక్’ సంపాదకుడు)