ప్రజాపక్షం / హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ప్రకటించిన బిజెపి ఉన్న ప్రాబల్యాన్ని కూడా కోల్పోయింది. 118 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం ఒక్క స్థానంలోనే గెలవడంతో బిజెపి శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లాయి. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని మోడీ, నలుగురు బిజెపి పాలిత సిఎంలు, 16 మంది కేంద్ర మంత్రులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా మోడీ మ్యాజిక్ తె లంగాణ రాష్ట్రంలో పనిచేయలేదు. గత ఎన్నికల్లో బిజెపి హైదరాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో గెలవగా, ప్రస్తుత ఎన్నికల్లో నాలుగు స్థానాలను కోల్పోయి ఒక్క స్తానానికి పరిమితమైంది. గోషామహల్ ని యోజకవర్గం నుంచి రాజాసింగ్ గెలుపొందారు. కాగా బిజెపి సీనియ ర్ నేతలు ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ముషీరాబాద్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, అంబర్‌పేట్‌లో బిజెఎల్‌పి మాజీ నేత జి.కిషన్ రెడ్డి, ఖైరతాబాద్‌లో చింతర రామచంద్రారెడ్డి, ఉప్పల్‌లో ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ ఓటమి పాలయ్యారు. కొత్తగా ఒక్క ఎంఎల్‌ఎ సీటును గెలవకపోగా ఉన్న నాలుగు స్థానాలను కోల్పోయిన బిజెపి రాష్ట్ర పార్టీ నాయకత్వంపై జాతీయ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్పప్పటికీ రాష్ట్ర నేతల అసమర్థత వల్లే ఓటమి పాలైనట్లు వారు అంచనాకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి సంస్థాగత నిర్మాణం, కేడర్ కొంత మేరకు ఉన్నప్పటికీ పోల్ మేనేజ్‌మెంట్‌లో బిజెపి రాష్ట్ర నాయకత్వం విఫలమైందని జాతీయ నేతలు అంటున్నారు.
ఒక్క సీటుకే కమలం పరిమితం
RELATED ARTICLES